New Film Releases: టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. వర్రీ అవుతున్న హీరోలు!

అఖండ, పుష్ప సక్సెస్ తో సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. ఆడియన్స్ కి కూడా ఇప్పుడిప్పుడే ధియేటర్లకు రావడంతో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు ధైర్యంగా..

New Film Releases: టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. వర్రీ అవుతున్న హీరోలు!

New Film Releases

New Film Releases: అఖండ, పుష్ప సక్సెస్ తో సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. ఆడియన్స్ కి కూడా ఇప్పుడిప్పుడే ధియేటర్లకు రావడంతో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు ధైర్యంగా ముందుకొస్తున్నాయి. వరుస సినిమా రిలీజ్ లతో ఇక సినిమా ఇండస్ట్రీ ట్రాక్ లో పడ్డట్టే అని అనుకునేలోపే.. మూడోగండం ముంచుకొస్తోందని టెన్షన్ పడుతున్నారు. ఇది నిజమైతే సినిమాల పరిస్తితేంటి అనే చర్చలు సాగుతున్నాయి. అఖండతో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప అంత పెద్ద సక్సెస్ అయినా ఇండస్ట్రీకి కరోనా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే మంచి కలెక్షన్లతో సినిమా ఇండస్ట్రీ కోలుకుంటోందని అనుకునే లోపే.. ఒమిక్రాన్ ఇండస్ట్రీని టెన్సన్ పెడుతోంది.

83 Movie: 83 సినిమాపై బాలీవుడ్ కాన్ఫిడెంట్.. టీమ్ ఇండియాకు ప్రీమియర్ షో!

పుష్ప మూవీ నార్త్ లో పెద్దగా ప్రమోషన్లు చెయ్యకపోయినా.. కలెక్షన్లు మాత్రం బాగానే సంపాదిస్తోంది. కానీ ఈ కలెక్షన్లకు బ్రేక్ వేసేలా ఉంది ఒమిక్రాన్. ఇప్పటికే విపరీతంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులతో డిల్లీతో పాటు మరికొన్ని చోట్ల న్యూఇయర్ సెలబ్రేషన్స్ తో పాటు మాస్ గేదరింగ్స్ అన్నిటినీ బ్యాన్ చేశారు. వీటితో ఆగకుండా ముందు ముందు సినిమాలు, థియేటర్ల విషయంలో కూడా నిబంధనలు మొదలైతే.. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల పరిస్థితి ఏంటా అని టెన్షన్ స్టార్ట్ అయ్యింది సినిమా ఇండస్ట్రీలో.

WWW Movie: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) సినిమా రివ్యూ

ఇంకా హై అలర్ట్ ఇచ్చేలోపే ఈ నెలలో తెలుగుకి సంబంధించినంతవరకూ పెద్ద సినిమా అయిన శ్యామ్ సింగరాయ్ సేఫ్ అయిపోతుంది. అసలు సమస్యంతా జనవరి సినిమాల రిలీజ్ విషయంలోనే. జనవరి7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది ట్రిపుల్ ఆర్ సినిమా. ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా కేసులు ఎక్కువవడంతో రిలీజ్ మీద, కలెక్షన్ల మీద గ్యారంటీగా ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఉంటుందని భయపడుతున్నారు ట్రిపుల్ ఆర్ టీమ్. సో పాన్ ఇండియా కంటే పెద్ద రేంజ్ లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ 2 వేల కోట్లకు పైగా కలెక్షన్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నంత ఫాస్ట్ గా ఒమిక్రాన్ కేసులు పెరిగితే సినిమా కలెక్షన్ల సంగతి తర్వాత.. అసలు రిలీజ్ కే మోసం వస్తుందేమో అని వర్రీ అవుతున్నారు.

Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాదేశ్యామ్ ని జనవరి 14న ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ మూవీ సందడి కంటే ముందు.. పెరుగుతున్న కోవిడ్ కేసులతో టెన్షన పడుతున్నారు టీమ్. సినిమా రిలీజ్ కు ఇంకా 20 రోజులు టైమ్ ఉండడంతో.. ఈలోపు ఒమిక్రాన్ స్పీడప్ అయితే.. ఇప్పటికే అలర్ట్ లో ఉన్న గవర్నమెంట్స్ మరోసారి ధియేటర్లకు ఆంక్షలు విధిస్తే.. సినిమా పరిస్థితి ఏంటని తెగ వర్రీ అవుతున్నారు టీమ్.