Suriya: ఒకవైపు స్టోరీ బేస్డ్ సినిమాలు.. మరోవైపు రొట్ట కొట్టుడు.. అస్సలు అర్థం కాడు!

తమిళ్ స్టార్ సూర్య.. ఎవ్వరికీ అర్థం కాడు. ఒక పక్క స్టోరీ బేస్డ్ ఆర్టిస్టిక్ సినిమాలు చేసి వవ్హా అనిపిస్తాడు. మరోవైపు సరుకు లేని సినిమాలు పట్టుకొచ్చి బాబోయ్ అనేలా చేస్తాడు.

Suriya: ఒకవైపు స్టోరీ బేస్డ్ సినిమాలు.. మరోవైపు రొట్ట కొట్టుడు.. అస్సలు అర్థం కాడు!

Suriya

Suriya: తమిళ్ స్టార్ సూర్య.. ఎవ్వరికీ అర్థం కాడు. ఒక పక్క స్టోరీ బేస్డ్ ఆర్టిస్టిక్ సినిమాలు చేసి వవ్హా అనిపిస్తాడు. మరోవైపు సరుకు లేని సినిమాలు పట్టుకొచ్చి బాబోయ్ అనేలా చేస్తాడు. ఏహే ఏంటిది అనుకునేలోపు ఏదో ఒక ప్రయోగం చేసి మాయ చేస్తాడు. అలా అని అన్ని ప్రయోగాలు జనాల్ని అలరించలేదు. అసలు ఇప్పుడేందుకు సూర్య మ్యాటర్ అనుకుంటున్నారా.. సరిగ్గా పైన చెప్పినట్లే ఉంది ఇప్పుడు ఈ స్టార్ హీరో వరస.

Suriya-Jyothika : 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసి నటించనున్న భార్య భర్తలు

నా రూటే సపరేటు అంటున్నారు సూర్య. ఎప్పుడు ప్రేక్షకులకు నచ్చే.. మెచ్చే సినిమాలు చేస్తారో.. రొట్ట కొట్టుడు ఫార్ములాతో రోటీన్ గా వచ్చేస్తారో ఎవ్వరికీ అర్థంకాదు. ఇప్పుడైతే డైరెక్టర్ బాలతో చేస్తోన్న సినిమా గురించి కోలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి. ఇందులో డబుల్ రోల్స్ లో నటిస్తున్న సూర్య.. మూగ, చెవిటి పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. అందులో ఒక క్యారెక్టర్ కి భార్యగా జ్యోతికను ఎంపిక చేసారనే ప్రచారమూ జరుగుతోంది. నంద, శివపుత్రుడు సినిమాలతో తనకు హ్యూజ్ మార్కెట్ తీసుకొచ్చిన డైరెక్టర్ బాలను మళ్లీ హిట్ ట్రాక్ లో పెట్టేందుకు సూర్య ఇలా రంగంలోకి దిగాడు.

Suriya: ఈటి దెబ్బతో సూర్యకు ఓటీటీలే దిక్కా?

సూర్యకి ప్రయోగాలు చేయడం కొత్తేం కాదు. కెరీర్ స్టారింగ్ నుంచి వీలైనప్పుడల్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నారు. సింగం లాంటి మాస్ ప్రాజెక్ట్స్ తో పాటూ సుందరాంగుడు, గజిని, సూర్యా సన్నాఫ్ కృష్ణన్, రక్తచరిత్ర2, సెవెన్త్ సెన్స్, బ్రదర్స్, 24 ఇలాంటి సినిమాలతో క్యారెక్టర్స్ వేరియేషన్స్ బాగానే చూపించారు. కమర్షియల్ హీరోగా తన హద్దులు చెరిపేసుకుని మేము, ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి వాటితో కూడా అట్రాక్ట్ చేశారు. నిర్మాతగా కూడా తన టేస్ట్ ఎలాంటిదో చూపించారు. అయితే అప్పుడప్పుడు అర్థంకాని ట్విస్ట్ లు ఇచ్చి ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ చేయడం కూడా సూర్యకి బాగా అలవాటే.

Boyapati-Suriya: టాలీవుడ్‌కు తమిళ హీరోలు.. సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా?

సూర్య కెరీర్ లో అసలేందుకు చేసారా అనే సినిమాలు కూడా ఉన్నాయి. అంజాన్, ఎన్జీకే, రీసెంట్ ఈటీ వరకు ఏం చూసి ఇలాంటి సినిమాలకు సైన్ చేశారా అనిపిస్తుంది. ఎంత మంచి యాక్టరో స్పెషల్ గా చెప్పక్కర్లేదు కానీ సినిమాల సెలెక్షన్ విషయంలో ఆయన అంచనాలు చాలాసార్లు తప్పాయన్నది నిజం. ప్రయోగాలు చేసినా సరే.. ప్రతీసారి కలిసిరాలేదు కూడా. అందుకే సూర్య డెసిషన్స్ అన్నవి అంత తొందరగా ఎవ్వరికీ అర్థంకావు. సూర్య యాక్టింగ్ స్కిల్స్ కి తగ్గ కంటెంట్ ఉంటే ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. లేదంటే అంతే ఈజీగా తిప్పికొడతారు.