Alka Yagnik : మరోసారి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన బాలీవుడ్ సింగర్..

'తేరి నాజ్రో మే హే తేరే సప్నే.. తేరే సాప్నో మే హే నరాజి' ఈ లిరిక్స్ అందరికి గుర్తుకు ఉండే ఉంటాయి కదా. 2015లో రణ్‌బీర్ కపూర్, దీపికా పడుకోణె నటించిన 'తమాషా' సినిమాలోని 'అగర తుమ్ సాత్ హో' సాంగ్ లోని లిరిక్స్ ఇవి. ఈ సాంగ్ ని పాడిన 'అల్కా యాగ్నిక్' వాయిస్ ఎవరు మర్చిపోలేరు. అల్కా వాయిస్ ఒకసారి వింటే చాలు మళ్ళీ మళ్ళీ ఆ పాటలను లూప్ లో పెట్టుకొని వినాలి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అల్కా పాడిన పాటలు యూట్యూబ్ లో బిలియన్ వ్యూస్ సాధిస్తుంటాయి. అలా...

Alka Yagnik : మరోసారి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన బాలీవుడ్ సింగర్..

Alka Yagnik

Alka Yagnik : ‘తేరి నాజ్రో మే హే తేరే సప్నే.. తేరే సాప్నో మే హే నరాజి’ ఈ లిరిక్స్ అందరికి గుర్తుకు ఉండే ఉంటాయి కదా. 2015లో రణ్‌బీర్ కపూర్, దీపికా పడుకోణె నటించిన ‘తమాషా’ సినిమాలోని ‘అగర తుమ్ సాత్ హో’ సాంగ్ లోని లిరిక్స్ ఇవి. ఏ ఆర్ రెహమాన్ అందించిన ఈ సాంగ్ ఇప్పటికి కూడా చాలా మంది ఫేవరెట్ లిస్ట్ లో ప్లే అవుతూనే ఉంటుంది. ఇక ఈ సాంగ్ ని పాడిన ‘అల్కా యాగ్నిక్’ వాయిస్ ఎవరు మర్చిపోలేరు. ఈ ఒక్క పాట మాత్రమే కాదు ఆమె పాడిన ఎన్నో పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

Pathaan Collections : ఆరు రోజుల్లో 600 కోట్లు.. వీక్ డేస్ లో కూడా పఠాన్ వసూళ్లు తగ్గట్లేదుగా..

అల్కా వాయిస్ ఒకసారి వింటే చాలు మళ్ళీ మళ్ళీ ఆ పాటలను లూప్ లో పెట్టుకొని వినాలి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అల్కా పాడిన పాటలు యూట్యూబ్ లో బిలియన్ వ్యూస్ సాధిస్తుంటాయి. అలా ఎక్కువ వ్యూస్ సాధించి అల్కా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అది కూడా ఒకసారి కాదు మూడుసార్లు గిన్నిస్ రికార్డు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. 2022 గాను యూట్యూబ్ లో అల్కా యాగ్నిక్ పాటలు దాదాపు 15.3 బిలియన్ వ్యూస్ సాధించి వరల్డ్ రికార్డ్ కొట్టింది.

ఇక గతంలో 2021లో 17 బిలియన్ స్ట్రీమ్‌లు సాధించగా, 2020లో 16.6 బిలియన్లు వ్యూస్ అందుకుంది. ప్రపంచంలో అత్యధికంగా స్ట్రీమ్‌లు సాధించిన వారిని గుర్తించి గిన్నిస్ బుక్ సత్కరిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే 2022 గాను అత్యధికంగా వ్యూస్ అందుకున్న అల్కా యాగ్నిక్ ని సత్కరించింది. అల్కా యాగ్నిక్ గత మూడు ఏళ్లగా ఈ రికార్డ్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.