OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా! OTT Platforms Big Offers to Telugu FIlm Makers with Huge Amounts

OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా!

కొవిడ్ కష్టాల్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి ఓటీటీలు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ మంచి రోజు కోసం ఎదురు చూస్తున్న మేకర్స్..

OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా!

OTT Platforms: కొవిడ్ కష్టాల్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి ఓటీటీలు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ మంచి రోజు కోసం ఎదురు చూస్తున్న మేకర్స్ కు గాలం వేసే పనిలో ఉన్నాయిప్పుడు. వందల కోట్లతో ఊరిస్తూ.. ఊ అంటారా, ఊహూ అంటారా అనుకుంటూ పెద్ద సినిమాల కోసం కాచుక్కూర్చున్నాయి. కొవిడ్ కాస్త భయపెడితే చాలు.. దర్శకనిర్మాతలకి బిగ్ ఆఫర్స్ ప్రకటించేస్తున్నాయి.

OTT Baahubali: ఆగిపోయిన బాహుబలి వెబ్ సిరీస్.. మన వాళ్ళకి అంత సీన్ లేదా?

కొవిడ్ గ్యాప్ ని బాగా వాడుకునేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాయి ఓటీటీలు. పెద్ద పెద్ద సినిమాలను డైరెక్ట్ రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఓటీటీ ఓనర్స్. కానీ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలనుకుంటున్న మనవాళ్లు ఆ క్రేజీ ఆఫర్స్ కు అంత ఈజీగా లొంగట్లేదు. రీసెంట్ గా రాధేశ్యామ్ డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం కాస్త గట్టిగానే జరిగింది. డీల్ అయిపోయింది ఇక అఫీషియల్ అనౌన్స్ మెంట్ మిగిలిందన్న రేంజ్ లో సోషల్ మీడియాను షేక్ చేశాయి వార్తలు. కానీ చివరికి రాధేశ్యామ్ థియేటర్స్ లోనే రిలీజ్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

Good Luck Sakhi: ఒకవైపు కరోనా ఉదృతి.. నేడు థియేటర్లలోకి ‘సఖి’

ఫస్ట్ నుంచి రాధేశ్యామ్ డైరెక్ట్ రిలీజే చేసేలా నిర్మాతలను బుట్టలో వేసేందుకు నెట్ ఫ్లిక్స్, జీ5 లాంటి ఓటీటీలు కాచుక్కూర్చున్నాయి. ఒక దశలో పోస్ట్ స్ట్రీమింగ్ తో పాటూ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న జీ5 రాధేశ్యామ్ ను డైరెక్ట్ రిలీజ్ చేస్తుందనే వార్తలొచ్చాయి. రీసెంట్ గా కూడా రాధేశ్యామ్ నిర్మాతలకు 500 కోట్ల వరకు ఓ ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. కానీ డీల్ కుదరకపోవడంతోనే మేకర్స్ థియేటర్స్ కి ఓటేసారనే టాక్ నడుస్తోంది. ఇంతవరకు మళ్లీ రాధేశ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ లో అనుమానాలు తలెత్తాయి. అయితే బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియెన్స్ కోసం గ్రాండియర్ గా రెడీ చేసిన రాధేశ్యామ్ ను ఓటీటీలో రిలీజ్ చేయమంటోంది యూవీ క్రియేషన్స్.

Ravi Teja: ఫిప్త్ గేర్‌లో దూసుకెళుతున్న మాస్ రాజా!

ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా ఓటీటీ డీల్స్ పై చర్చలు గట్టిగానే నడిచాయి. ఫ్యాన్సీ ఆఫర్స్ తో మేకర్స్ కు ఆశ చూపించాయి కూడా. నేరుగా ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ కోసం 500 కోట్లను దాటిన క్రేజీ ఆఫర్స్ కూడా జక్కన్న తలుపుతట్టాయి. కానీ రాజమౌళితో సహా మూవీ మేకర్స్ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని భీష్మించుకున్నారు. అందుకే ఇలాంటి ఆఫర్స్ కు నో చెప్పారు.

Sarkaru Vaari Paata: సింగిల్ కష్టాలు.. మరో అగ్నిపరీక్షకు రెడీ అయిన థమన్!

గతంలో ఓటీటీ గాసిప్స్ ట్రెండ్ అయినప్పుడు.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన 90 రోజుల తర్వాతే ఓటీటీకి వస్తుందని పెన్ స్టూడియోస్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. మార్చి 18 లేదంటే ఏప్రిల్ 28 అని కొత్త డేట్స్ ప్రకటించిన జక్కన్న.. థియేటర్స్ లో రిలీజ్ చేసి ఒక్క రోజులోనే 100 కోట్లు కొల్లగొట్టాలనే టార్గెట్ లో ఉన్నారు. అలాంటిది ఎంతటి క్రేజీ ఓటీటీ డీల్స్ అయినా ఆనడం కష్టమే.

Tollywood Star Hero’s: ఈమధ్య కాలంలో వినని.. చూడని స్టార్ హీరోల లైనప్స్!

కేవలం తెలుగు రాష్ట్రాలనే టార్గెట్ చేసిన భీమ్లా నాయక్ ను కూడా టార్గెట్ చేశాయి ఓటీటీలు. థియేటర్ రిలీజ్ తర్వాత పవన్ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్న అమెజాన్ ప్రైమ్.. భీమ్లా డైరెక్ట్ రిలీజ్ కోసం గట్టిగానే ప్రయత్నించింది. కొవిడ్ టైమ్, రిలీజ్ క్లాషెస్ ను పావులుగా వాడుకొని 150 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చింది అటు నెట్ ప్లిక్స్ కూడా అంతకుమించి అన్న రేంజ్ లో ట్రైల్స్ వేసింది కానీ ఏవీ వర్కవుట్ కాలేదు. బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ చూపించే స్టామినా ముందు ఇవేమీ పెద్ద డీల్స్ కాదని ఓటీటీలకు వెంటనే నో చెప్పేసారు భీమ్లా నాయక్ మేకర్స్.

Dil Raju : ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు, హరీష్ శంకర్

కేజీఎఫ్2ని నేరుగా ఓటీటీలో విడుద‌ల చేస్తే కళ్లుచెదిరే క్యాష్ ఇస్తామంటూ చాలానే ఆఫర్స్ వచ్చాయి. కానీ, మూవీ యూనిట్ మాత్రం అలాంటి ఓటీటీ ఆఫ‌ర్స్ రిజెక్ట్ చేసింది. యష్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని.. క‌ష్ట‌మైనా, ఎన్ని రోజులు లేట్ అయినా థియేట‌ర్‌లోనే సినిమాను విడుద‌ల చేయాల‌ని, ఈ విష‌యంలో అస‌లు త‌గ్గేదే లే అని మేక‌ర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక య‌ష్ కూడా థియేట‌ర్‌లోనే కేజీఎఫ్ 2 వ‌స్తుంద‌ని ఈమధ్యే క్లారిటీ కూడా ఇచ్చాడు. ఏప్రిల్ 14 కోసం వెయిట్ చేస్తున్నట్టు కేజీఎఫ్ 2 టీమ్ ప్రకటించింది.

RRR: ఆర్ఆర్ఆర్ విడుదల మార్చిలో లేనట్లే.. అసలు కారణం ఇదే!

ఇవే కాదు వాయిదాల మీద వాయిదాలు పడుతున్న చాలా సినిమాలకే ఓటీటీలు గాలం వేశాయి కానీ పాన్ ఇండియాను టార్గెట్ చేసిన బిగ్ స్టార్స్ ఎవ్వరూ ఓటీటీ డీల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. నేషనల్ వైడ్ పుష్ప, తెలుగు రాష్ట్రాల్లో అఖండ లాంటి సినిమాలు థియేటర్స్ లో చేసిన హడావిడీ వాళ్లకి బూస్టప్ నిస్తుంది. అటు థియేట్రికల్ సక్సెస్ తర్వాత అంతే రేంజ్ లో ఓటీటీల్లోనూ ఆదరణ దక్కుతుంది. హాట్ స్టార్ లో అఖండ, ప్రైమ్ లో పుష్ప రికార్డులు సృష్టిస్తున్నాయి. సో ముందు థియేటర్… ఆ తర్వాతే ఓటీటీ అంటున్నారు స్టార్స్.

×