Urvasivo Rakshasivo: అల్లు శిరీష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ..

అల్లు శిరీష్ హీరోగా, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా “ఊర్వశివో రాక్షసివో”. గీత ఆర్ట్స్-2 పతాకంపై తెరక్కెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 4న విడుదలకు సిద్దమవుతుంది. సినిమా విడుదల దగ్గర పడడంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ఈ నెల 30న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారు.

Urvasivo Rakshasivo: అల్లు శిరీష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ..

Pawan Kalyan and Balayya for Urvasivo Rakshasivo Pre Release Event

Urvasivo Rakshasivo: అల్లు శిరీష్ హీరోగా, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా “ఊర్వశివో రాక్షసివో”. గీత ఆర్ట్స్-2 పతాకంపై తెరక్కెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 4న విడుదలకు సిద్దమవుతుంది. సినిమా విడుదల దగ్గర పడడంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచింది.

Urvasivo Rakshasivo Teaser: ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్.. రొమాన్స్ తో రెచ్చిపోయిన శిరీష్!

ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ఈ నెల 30న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ కారిక్రమానికి అల్లు అరవింద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిధిగా తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తుంటే, గీతా ఆర్ట్స్‌లోని కొన్ని వర్గాలు మాత్రం బాలకృష్ణను ఆహ్వానించినట్లు చెబుతున్నారు.

ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షోకి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే, ఆ సాన్నిహిత్యంతో బాలయ్య ఈ ఈవెంట్ కు హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ఇద్దరి స్టార్స్ లో ఏ హీరో హాజరుకాబోతున్నారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.