Pawan Kalyan OG : OG నుంచి అదిరిపోయే అప్డేట్..
ఓ వైపు రాజకీయాలు, మరో వైపు వరుస సినిమా షూటింగ్స్‌తో పుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది చివరి కల్లా చేతిలో ఉన్న సినిమా షూటింగ్స్ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు

Pawan Kalyan joins in OG Movie Third schedule shoot
Pawan Kalyan: ఓ వైపు రాజకీయాలు, మరో వైపు వరుస సినిమా షూటింగ్స్‌తో పుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది చివరి కల్లా చేతిలో ఉన్న సినిమా షూటింగ్స్ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను సక్సెస్ పుల్‌గా పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ ముంబైలో జరుగగా, రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. ఇక మూడో షెడ్యూల్ ఈ నెల 4 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాగా.. నేడు పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో ఓ ఫోటో ద్వారా తెలియజేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పవన్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అన్న సంగతి తెలిసిందే.
#OG enters the set… 🔥🔥🔥
An action-packed schedule is underway, filled with style, mass and energy. 🤟🏻#FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/O7m5RdSVOC
— DVV Entertainment (@DVVMovies) June 8, 2023
CM KCR-Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన హీరో శర్వానంద్.. ముచ్చటేంటంటే..?
ఈ సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశం కోసం ఓ భారీ సెట్‌ని చిత్రబృందం నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆర్ డైరెక్టర్ ఆనంద్ సాయి దగ్గరుండి పనులను చూసుకుంటున్నాడు. OG షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తరువాత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’లో పాల్గొననున్నాడు. ఆ తరువాత ఉస్తాద్ షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఇప్పటికి ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.
ఇక హరిహర వీరమల్లు విషయానికి వస్తే.. షూటింగ్ ప్రారంభమై మూడు సంవత్సరాలు అవుతోంది. ఇంకా 50 శాతం షూటింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పిరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. పవన్ నటించిన BRO చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. సాయి ధరమ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Karna : భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కర్ణ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..