Prabhas : అద్దంలో చూసుకున్నప్పుడు ఆయన గుర్తుకు రావడానికి గడ్డం పెంచుతా.. ప్రభాస్!

రెబల్ స్టార్ ప్రభాస్ లుక్స్ కి అబ్బాయిలు నుంచి అమ్మాయిలు వరకు అందరు ఫిదా అయిపోతుంటారు. ఇక ప్రభాస్ గడ్డంతో ఉన్న లుక్స్ ఎంతోమందికి ఫేవరెట్. మనలో చాలా మంది కూడా గడ్డాన్ని స్టైల్ కోసం పెంచుతారు. కానీ ప్రభాస్ గడ్డం పెంచడం వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. ఆ విషయాన్ని తాజాగా ప్రభాస్ తెలియజేశాడు.

Prabhas : అద్దంలో చూసుకున్నప్పుడు ఆయన గుర్తుకు రావడానికి గడ్డం పెంచుతా.. ప్రభాస్!

prabhas

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ లుక్స్ కి అబ్బాయిలు నుంచి అమ్మాయిలు వరకు అందరు ఫిదా అయిపోతుంటారు. ఇక ప్రభాస్ గడ్డంతో ఉన్న లుక్స్ ఎంతోమందికి ఫేవరెట్. ఇటీవల బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో గడ్డంతో ఉన్న ప్రభాస్ లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. మనలో చాలా మంది కూడా గడ్డాన్ని స్టైల్ కోసం పెంచుతారు. కానీ ప్రభాస్ గడ్డం పెంచడం వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. ఆ విషయాన్ని తాజాగా ప్రభాస్ తెలియజేశాడు.

Project K : ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్డేట్.. ప్రాజెక్ట్-K రిలీజ్ డేట్!

2010లో ప్రభాస్ తండ్రి మరణించిన సంగతి అందరికి తెలిసిందే. అప్పటి నుంచి తన తండ్రిని మిస్ అవుతున్న ప్రభాస్.. ఆయన గుర్తుకు వచ్చిన ప్రతిసారి అద్దం ముందుకు వెళ్లి తనని తాను చూసుకుంటాడు అంటా. గడ్డంలో ఉన్న తనని చూసుకుంటే తన తండ్రిలా కనిపించిన భావం కలిగిస్తుందట. ఆ ఫీలింగ్ తన తండ్రి తనతోనే ఉన్నాడు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది అని, అందుకే తాను గడ్డం పెంచడానికి ఇష్టం పడతాను అంటూ వివరించాడు.

కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ ఏడాది జూన్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ సలార్ విడుదలకు సిద్దమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్-K రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. శివరాత్రి సందర్భంగా విడుదల తేదిని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. పోస్టర్ బట్టి చూస్తే.. ప్రాజెక్ట్-K సూపర్ హీరో కథనంతో మార్వెల్ మూవీస్ తరహాలో ఉండబోతుంది అని అర్ధమవుతుంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు.