Tollywood : ముగిసిన ప్రొడ్యూసర్ గిల్డ్-మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగ్.. ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ తగ్గుతాయా?

ఆర్టిస్టుల రెమ్యునరేషన్, టైమింగ్స్, ఆర్టిస్టుల సైడ్ నుండి ఉండే సమస్యలపై చర్చించడానికి నేడు బుధవారం మధ్యాహ్నం ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కీలక సమావేశం.........

Tollywood : ముగిసిన ప్రొడ్యూసర్ గిల్డ్-మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగ్.. ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ తగ్గుతాయా?

Tollywood :  టాలీవుడ్ వరుస సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు షూటింగ్స్ కూడా ఆపేశారు. నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్, పలు విభాగాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. టాలీవుడ్ కి ఉన్న ముఖ్య సమస్యల్లో ఆర్టిస్టులు, హీరోల రెమ్యునరేషన్ ఒకటి. వారి అసిస్టెంట్స్ ని కూడా నిర్మాతలే చూసుకోవడం ఒకటి. ఇప్పటికే దిల్ రాజు రామ్ చరణ్ తో మాట్లాడి హీరోలతో రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడమని ఒప్పించాడు. త్వరలోనే చరణ్ హీరోలతో సమావేశం అవనున్నాడు.

ఆర్టిస్టుల రెమ్యునరేషన్, టైమింగ్స్, ఆర్టిస్టుల సైడ్ నుండి ఉండే సమస్యలపై చర్చించడానికి నేడు బుధవారం మధ్యాహ్నం ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కీలక సమావేశం నిర్వహించారు. ముందుగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ సమావేశం జరుగుతుంది అన్నారు కానీ చివరకి దిల్ రాజు ఆఫీస్ లో ఈ మీటింగ్ జరిగింది. ‘మా’ నుంచి మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, రఘుబాబు, శివబాలాజీ హాజరయ్యారు. ప్రొడ్యూసర్ గిల్డ్ నుంచి దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, శరత్ మరార్, బాపినీడు, మైత్రి రవి, వివేక్ కుచిబొట్ల తదితరులు హాజరయ్యారు.

Swathimuthyam : నితిన్, నిఖిల్ కోసం పక్కకు తప్పుకున్న బెల్లంకొండ హీరో.. స్వాతిముత్యం వాయిదా..

దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. ఈ సమావేశంలో సినిమా షూటింగుల్లో వెస్టేజ్, లోకల్ టాలెంట్ ఉపయోగించుకోవటం, ఇతర భాషా నటీనటుల మెంబర్ షిప్, ఆర్టిస్ట్ ల రెమ్యునిరేషన్లు, డైలీ పేమెంట్ ఆర్టిస్టుల సమస్యలు, ఆర్టిస్టుల స్టాఫ్ ఖర్చులు.. మొదలైన అంశాలపై కీలక చర్చ జరిగింది. త్వరలో మరోసారి ఇరు పక్షాలు‌‌‌‌ సమావేశం కానున్నారు. కాస్ట్ కంట్రోల్, రెమ్యునరేషన్ల విషయంలో ప్రత్యేక కమిటీని వేశారు. మరి ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు తాగుతాయా? సమస్యలు తీరుతాయా అంటే ఎదురు చూడాల్సిందే.