Kantara : కాంతార-2 కన్‌ఫార్మ్ చేసిన నిర్మాత.. సీక్వెల్ కాదు ప్రీక్వెల్!

శాండిల్‌వుడ్‌లో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా వైడ్ అభిమానాన్ని సంపాదించుకున్న చిత్రం 'కాంతార'. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ తీసుకు వచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. షూటింగ్ అండ్ రిలీజ్ డేట్ తో సహా నిర్మాత అధికారికంగా వెల్లడించాడు.

Kantara : కాంతార-2 కన్‌ఫార్మ్ చేసిన నిర్మాత.. సీక్వెల్ కాదు ప్రీక్వెల్!

producer Vijay Kiragandur confirms kantara 2

Kantara : శాండిల్‌వుడ్‌లో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా వైడ్ అభిమానాన్ని సంపాదించుకున్న చిత్రం ‘కాంతార’. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని తెరకెక్కించిన హోంబలే నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. కన్నడ నాట సూపర్ హిట్టు కావడంతో ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో.. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.590 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Kantara : కాంతారలో జరిగిన సంఘటన రిషబ్‌కి రియల్‌గా ఎదురైంది.. వైరల్ అవుతున్న వీడియో!

అంతేకాదు ఈ సినిమా ప్రపంచ ప్రఖ్యాతి పురస్కారమైన ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లిస్ట్ లో కూడా స్థానం దక్కించుకుంది. ఇక ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ తీసుకు వస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీని పై చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ అధికారిక ప్రకటన చేశాడు. కాంతార-2 తీసుకు రాబోతున్నాము. కానీ ఇది సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అంటూ వెల్లడించాడు. కాంతార మూవీ మొదటిలో హీరో తండ్రి మాయమై పోతాడు. అతను ఎక్కడకి వెళ్ళాడు? అలాగే అతని జీవితం నేపద్యతంతో కాంతార-2 కథ ఉండబోతుంది అని తెలుస్తుంది.

అలాగే ఈ సినిమా కథ మరియు చిత్రీకరణకి సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే మొత్తం సిద్ధం చేసుకున్నట్లు తెలియజేశాడు నిర్మాత విజయ్. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది జూన్ లో మొదలు కానుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు వర్షం కాలం బ్యాక్‌డ్రాప్ తో ఉండడం వలన ఆ నెల నుంచి మూవీ సెట్స్ పైకి తీసుకు వెళదాం అని అనుకుంటున్నాము అని తెలియజేశాడు. అంతే కాదు సినిమా రిలీజ్ సమయాన్ని కూడా వెల్లడించేశాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారనే ఎన్నో రికార్డులు సృష్టిస్తే, ఇప్పుడు భారీ అంచనాలు నెలకున్న ఈ ప్రీక్వెల్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిప్రాయపడుతున్నారు నెటిజెన్లు.