Radhe Shyam : రాధేశ్యామ్ మేకర్స్ గొప్ప మనసు.. షూటింగ్‌ కోసం తెచ్చిన బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఆసుపత్రికి దానం

కరోనా కష్ట కాలంలో ‘రాధేశ్యామ్‌’ చిత్ర యూనిట్‌ తన వంతు సాయం చేసింది. ఓ ఆస్పత్రికి 52 బెడ్లు సమకూర్చింది. అదీ సినిమా షూటింగ్ కోసం వేసిన ఆస్పత్రి సెట్‌కి సంబంధించిన బెడ్లు. ఇంకా స్ట్రెచర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, సెలైన్‌ స్టాండ్లు.. ఇలా సెట్‌లో భాగంగా వేసినవన్నీ కూడా ఇచ్చారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ‘రాధేశ్యామ్‌’ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Radhe Shyam : రాధేశ్యామ్ మేకర్స్ గొప్ప మనసు.. షూటింగ్‌ కోసం తెచ్చిన బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఆసుపత్రికి దానం

Radhe Shyam

Radhe Shyam : కరోనా కష్ట కాలంలో ‘రాధేశ్యామ్‌’ చిత్ర యూనిట్‌ తన వంతు సాయం చేసింది. ఓ ఆస్పత్రికి 52 బెడ్లు సమకూర్చింది. అదీ సినిమా షూటింగ్ కోసం వేసిన ఆస్పత్రి సెట్‌కి సంబంధించిన బెడ్లు. ఇంకా స్ట్రెచర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, సెలైన్‌ స్టాండ్లు.. ఇలా సెట్‌లో భాగంగా వేసినవన్నీ కూడా ఇచ్చారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ‘రాధేశ్యామ్‌’ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో భారీ ఆస్పత్రి సెట్‌ వేశారు. వీటినే ఓ ప్రముఖ ప్రైవేట్‌ ఆస్పత్రికి ఇచ్చారు. ‘‘ఆస్పత్రి డాక్టర్‌ నా ఫ్రెండ్‌. బెడ్లు కొరత ఉందంటే.. ఓ పది ఎరేంజ్‌ చేశాను. అయితే అవి ‘రాధేశ్యామ్‌’ సెట్‌వి కాదు. ఆ తర్వాత ఇంకా కావాలని అడిగితే, ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు నా భార్య సంధ్య సినిమా సెట్‌లోవి ఇవ్వొచ్చు కదా అంది. ఆస్పత్రివాళ్లతో అంటే.. ‘సినిమాకి వేసినవి కదా.. పేషెంట్లకు సౌకర్యంగా ఉంటాయో? లేదో’ అన్నారు. ఫొటో పంపించాను.

నిజానికి నేను అచ్చం ఆస్పత్రికి వాడే బెడ్లులాంటివే సెట్‌ వేశాను. బెడ్‌ హైట్‌ ఎంత ఉండాలి? పొడవు వంటివన్నీ ముందే తెలుసుకుని వేశాను. పైగా 1970ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా కాబట్టి, అప్పటి బెడ్లు కొంచెం పెద్దగా ఉంటాయి. అలానే తయారు చేశాం. ఆస్పత్రివారికి బాగా అనిపించడంతో.. అన్నింటినీ శానిటైజ్‌ చేసి, 13 ట్రక్కుల్లో మొత్తం 50 బెడ్లు, ఇతర పరికరాలు పంపించాం. ఆ తర్వాత ఇంకోటి చూడండి అని ఫోన్‌ చేసినప్పుడు, చాలా బాధ అనిపించింది.

అది మాత్రమే కాదు.. ట్రక్కులు బయలుదేరాక… ఇంకో అరగంట పడుతుందా? గంటలో చేరతాయా? అంటూ… ఆస్పత్రివారు ఆదుర్దాగా ఫోన్‌ చేశారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించుకోండి. ఆ తర్వాత ఇంకో బెడ్‌ ఉందా? అని అడిగితే, రెండు పంపించాం’’ అని ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి చెప్పారు.

కాగా, ఈ సెట్‌లో ఇంకా షూటింగ్‌ పూర్తి కావాల్సి ఉంది. ప్రభాస్‌ మీద ఒక భారీ సీన్‌ తీయాల్సి ఉంది. కానీ మా నిర్మాతలు అదేం ఆలోచించ లేదు. ఈ సమయంలో హెల్ప్‌ చేయాలి. తర్వాత సంగతి తర్వాత అన్నారు. హ్యాపీగా ఇచ్చేశాం. మా యూనిట్‌ నుంచి ఈ విధంగా హెల్ప్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని రవీందర్ అన్నారు.