Rajamouli : సైబర్ నేరాలపై రాజమౌళి ప్రత్యేక క్లాస్‌లు.. పోలీసులను డౌట్స్ అడిగిన దర్శక ధీరుడు

బాహుబలి, RRR చిత్రాలతో ఇండియాలో స్టార్ హీరోతో సమానంగా స్టార్‌డమ్ సంపాదించుకున్న రాజమౌళి (Rajamouli) ని.. పలువురు అధికారులు ప్రజల్లో సామజిక అవగాహనా కల్పించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే..

Rajamouli : సైబర్ నేరాలపై రాజమౌళి ప్రత్యేక క్లాస్‌లు.. పోలీసులను డౌట్స్ అడిగిన దర్శక ధీరుడు

Rajamouli as promoter of Cyber Crime Awareness

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) బాహుబలి, RRR చిత్రాలతో ఇంటర్నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక ఇండియాలో అయితే స్టార్ హీరోతో సమానంగా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. దీంతో రాజమౌళి క్రేజ్ ని పలువురు అధికారులు ప్రజల్లో సామజిక అవగాహనా కల్పించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచారకర్తగా ఎంపిక అయ్యాడు. ఓటు హక్కుని ఉపయోగించుకోవడం ప్రతి పౌరుడి భాద్యత అని తెలియజేయబోతున్నాడు. తాజాగా హైదరాబాద్ సైబర్ (Hyderabad Cyber Crime Police) అధికారులు కూడా రాజమౌళి సేవలు కోసం ఆయనని సంప్రదించారు.

Rajamouli – Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేష్ హనుమంతుడి పాత్ర.. అమెజాన్ అడవుల్లో సాహసం!

ఈ ప్రోగ్రాంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘మా షూటింగ్ సేట్ లో వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి సైతం ఈ సైబర్ కాల్ కి గురయ్యాడు. బ్యాంక్ మేనేజర్ అని చెప్పి ఓటిపి అడిగాడు. తను ఆలోచించకుండా ఓటీపీ చెప్పేశాడు. అంతే అతని బ్యాంక్ ఖాతా నుండి 10 నెలల జీతాన్ని కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. కష్టపడి సంపాదించే డబ్బుతో వచ్చే ఆనందం వేరు. కానీ ఈజీగా మని సంపాదించాలనే దురాశ సైబర్ మోసానికి దారితీస్తుంది. పెద్ద పొలిటీషియన్, స్టార్ సెలబ్రిటీ మొదలుకుని సాధారణ కూలీ వరకు ప్రతీ ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులే. రెండు రూపాయల వడ్డీ కన్నా ఎక్కువ ఇస్తున్నాడు అంటే అది కచ్చితంగా మోసం, ఇల్లీగల్ మనీ అయి ఉంటుంది. వంద పెడితే వెయ్యి, వెయ్యి పెడితే లక్ష, లక్ష పెడితే పది లక్షలు వస్తాయని మోసపోయి డబ్బులు పోగొట్టుకోవడం మన అవివేకం అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సమ్మిట్ లోనే తనకి ఉన్న కొన్ని సందేహాలను రాజమౌళి సైబర్ క్రైమ్ పోలీసులను అడిగాడు.
Q1 – నా క్రెడిట్ కార్డు ఎక్స్‌పైరీ అయింది అర్జెంటుగా కేఓసి ఫామ్ నింపండి అని కాల్ వస్తే ఏమి చేయాలి?
Q2 – నాకు కూడా ఎన్నో ఫేక్ కాల్స్ వచ్చాయి, బ్యాంక్ నుంచి చేస్తున్నామని, పోలీస్ డిపార్ట్మెంట్ అని!
Q3 – అన్ లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాల్స్ కూడా వచ్చాయి ఏమి చేయాలి ఎలా ఫిర్యాదు చేయాలి?
Q4 – చాలా వెబ్ సైట్స్ ఫేక్ ఉన్నాయి. గూగుల్ లో నుండి కస్టమర్ కేర్ నంబర్ ద్వారా ఫ్రాడ్ జరుగుతుంది ఎలా?

రాజమౌళి ప్రశ్నలకుపోలీస్ శాఖ సమాధానం ఇస్తూ..
->www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు.
->వెంటనే 1930 డయల్ చేయండి.
->మా పోలీస్ వారు మిమల్ని గైడ్ చేస్తారు.