Rajamouli : స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ.. హాలీవుడ్ వాళ్ళకి కూడా ప్రమోషన్ కి రాజమౌళే కావాలి..

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ‘ది ఫేబుల్‌మ్యాన్స్‌’ (The Fabelmans) సినిమా హాలీవుడ్ లో ఎప్పుడో రిలీజ్ అయినా తాజాగా ఇండియాలో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 10న ఇండియాలో ఈ సినిమా రిలీజయింది. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళిని..............

Rajamouli : స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ.. హాలీవుడ్ వాళ్ళకి కూడా ప్రమోషన్ కి రాజమౌళే కావాలి..

Rajamouli Promotes Steven Spielberg The Fabelmans movie in India

Rajamouli :  హాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ గతేడాది ది ఫేబుల్‌మ్యాన్స్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ లో కూడా నిలిచింది. మన రాజమౌళి హాలివూడ్ దాకా వెళ్లి అక్కడ స్టార్స్ ని కలిసి, వాళ్ళు రాజమౌళిని అభినందించిన సంగతి తెలిసిందే. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ కూడా రాజమౌళిని కనిసి RRR సినిమా విషయంలో అభినందించగా రాజమౌళి నా దేవుడిని కలిశాను అంటూ ఆనందించారు.

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ‘ది ఫేబుల్‌మ్యాన్స్‌’ (The Fabelmans) సినిమా హాలీవుడ్ లో ఎప్పుడో రిలీజ్ అయినా తాజాగా ఇండియాలో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 10న ఇండియాలో ఈ సినిమా రిలీజయింది. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళిని వాడుకున్నారు. రాజమౌళికి ఇండియా అంతటా ఉన్న ఫేమ్ గుర్తించి ఈ ది ఫేబుల్‌మ్యాన్స్‌ సినిమా ప్రమోషన్స్ కోసం డైరెక్టర్ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ని రాజమౌళితో వీడియో కాల్ ఇంటర్వ్యూ చేయించారు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ లో ఉంది.

ఈ ఇంటర్వ్యూలో స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ రాజమౌళిని, RRR సినిమాని మరోసారి అభినందించారు. దీనికి రాజమౌళి నాకైతే డ్యాన్స్ చేయాలని ఉంది సర్ అంటూ చెప్పడం విశేషం. ఇక రాజమౌళి ఈ సినిమా గురించి పలు ప్రశ్నలు అడిగాడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ని. ఈ సినిమా ఆల్మోస్ట్ తన లైఫ్ అని, నా చిన్నప్పుడు లైఫ్, నా చుట్టూ ఉన్న పరిస్థితులు, సినిమా మీద ఉన్న ప్రేమ.. ఇవన్నీ కలిపి తీశానని చెప్పారు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌. ఇన్నాళ్లు అనేక సినిమాలు తీసి ఇప్పుడు నా గురించి ఏమన్నా చెప్పొచ్చా అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది అని తెలిపారు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌. రాజమౌళి కూడా ది ఫేబుల్‌మ్యాన్స్‌ సినిమా చూశానని, తనకి చాలా బాగా నచ్చింది అని తెలిపాడు. ఇలా ది ఫేబుల్‌మ్యాన్స్‌ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడుతూ ప్రమోషన్స్ చేశారు.

Hansika : నా భర్తకు అంతకుముందే పెళ్లి అయింది.. నా భర్త విడాకులకు నేను కారణం కాదు.. హన్సిక వ్యాఖ్యలు..

అయితే ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవ్వగా హాలీవుడ్ సినిమాలని ఇండియాలో ప్రమోట్ చేయడానికి ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు. రాజమౌళిని హాలీవుడ్ వాళ్ళు ప్రమోషన్స్ కి వాడనుకుంటున్నారు. రాజమౌళి రేంజ్ హాలీవుడ్ మొత్తం పాకేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. భవిష్యత్తులో మరిన్ని హాలీవుడ్ సినిమాలని రాజమౌళి ప్రమోట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.