RRR: ఆర్ఆర్ఆర్ వాయిదా పడినా బాధలేదు.. చెర్రీ భావోద్వేగం!

ఈ ఏడాది సంక్రాంతి బోనాంజాగా.. భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూశాయి. అయితే, జనవరి 7న విడుదలై సంక్రాంతి బరిలో ఉండాల్సిన సినిమా..

RRR: ఆర్ఆర్ఆర్ వాయిదా పడినా బాధలేదు.. చెర్రీ భావోద్వేగం!

Rrr

RRR: ఈ ఏడాది సంక్రాంతి బోనాంజాగా.. భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూశాయి. అయితే, జనవరి 7న విడుదలై సంక్రాంతి బరిలో ఉండాల్సిన సినిమా కరోనా కేసుల ఉద్దృతి దృష్ట్యా అనూహ్యంగా సినిమాను వాయిదా వేస్తూ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. అప్పటి వరకు విస్తృత స్థాయిలో ప్రమోషన్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమా వాయిదా వేయడంతో నిరాశకు లోనయ్యారు.

Arjun-Malaika: అర్జున్-మలైకా బ్రేకప్.. ఏంటి హాట్ కపుల్ విడిపోతున్నారా?

ఆర్ఆర్ఆర్ వాయిదాపై ఎంతగానో ఎదురుచూసిన అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవిధంగా ఆర్ఆర్ఆర్ వాయిదాపై స్పందించిన రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాత శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న రౌడీ బాయ్స్ మ్యూజికల్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆశీష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ఆర్ఆర్ఆర్ వాయిదాపై స్పందించాడు. గద్గద స్వరంతో మాట్లాడుతూ చరణ్.. ‘ఈ సంక్రాంతికి మా సినిమా రాకపోయినా మాకేం బాధలేదు.. ఎందుకంటే సరైన సమయంలో రావాలి.

Chiru 154: చిరుకి తమ్ముడిగా మాస్ రాజా.. బర్త్ డే రోజు ప్రకటన!

ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్లు కష్టపడ్డాం. సరైన సమయంలో ఆర్ఆర్ఆర్ విడుదల చేసేందుకు మా పెద్దలు రాజమౌళి, దానయ్య కృషి చేస్తున్నారు. మా సినిమాను ఆదరించేందుకు ప్రతి ఫంక్షన్ కు వచ్చిన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు అన్నాడు. మాకు సంక్రాంతి ఎంత ముఖ్యమో కాదో మాకు తెలీదు కానీ.. సంక్రాంతి పండుగకి దిల్‌ రాజు మాత్రం చాలా ముఖ్యం. సంక్రాంతి మమ్మల్ని వదులుకోడానికైనా రెడీగా వుంది కానీ దిల్‌ రాజుని వదులుకోడానికి రెడీగా లేదు. ఇలాంటి సక్సస్‌ ఫుల్‌ సంక్రాంతులు ఎన్నో దిల్‌ రాజు చూశాడు. ఈ సంక్రాంతి కూడా ఆయనదే కావాలని కోరుకున్నాడు. ఇక మమ్మల్ని ఆదరించినట్టే ‘రౌడీ బాయ్స్‌’ చిత్ర హీరో ఆశీష్‌ను కూడా ఆశీర్వదించాలని చెర్రీ కోరాడు.