Sharwanand : శర్వానంద్ సంగీత్ వేడుకలో చరణ్.. బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళిలో చరణ్ సందడి..
జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా అండ్ రక్షిత వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న జూన్ 2న ఉదయం హల్దీ ఫంక్షన్ జరగగా, నిన్న రాత్రి సంగీత్ వేడుక జరిగింది.

Ram Charan enjoying in Sharwanand Sangeeth Ceremony
Ram Charan : టాలీవుడ్(Tollywood) లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన శర్వానంద్(Sharwanand) ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 26న ఎటువంటి ప్రకటన లేకుండా సడన్ గా నిశ్చితార్ధం చేసుకొని అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు రక్షిత(Rakshita)ను శర్వా వివాహం చేసుకోబోతున్నాడు. రక్షిత ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది.
జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా అండ్ రక్షిత వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న జూన్ 2న ఉదయం హల్దీ ఫంక్షన్ జరగగా, నిన్న రాత్రి సంగీత్ వేడుక జరిగింది. శర్వా పెళ్లి వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇక శర్వా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన రామ్ చరణ్ కూడా వివాహ వేడుకలకు వచ్చి సందడి చేశాడు.
Sharwanand : శర్వానంద్ పెళ్లి శుభలేఖ చూశారా.. పెళ్ళికొడుకుని చేసే టైం, పెళ్లి టైం ఎప్పుడంటే!
రామ్ చరణ్ నిన్న సాయంత్రమే జైపూర్ వెళ్లి శర్వా సంగీత్ వేడుకల్లో పాల్గొన్నాడు. శర్వా సంగీత్ వేడుకల్లో చరణ్ సందడి చేసాడు. శర్వాతో పాటలు పలువురు బంధువులు టాలీవుడ్ పాటలకు డ్యాన్సులు వేసి హంగామా చేశారు. చరణ్ ఫోటోలు, శర్వా సంగీత్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.