Ram Charan : అల్లు అర్జున్ నో చెప్పిన రోల్ కి చరణ్? మరో బాలీవుడ్ సినిమాలో చరణ్ గెస్ట్ రోల్..

తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో షారుఖ్, నయనతార జంటగా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా మరోసారి అదరగొట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలోని క్యామియో రోల్ ను మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయించబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి................

Ram Charan : అల్లు అర్జున్ నో చెప్పిన రోల్ కి చరణ్? మరో బాలీవుడ్ సినిమాలో చరణ్ గెస్ట్ రోల్..

Ram Charan guest appearance in shahrukh khan jawan movie

Ram Charan :  ‘పఠాన్’ సూపర్ సక్సెస్ తో షారుఖ్ నెక్స్ట్ మూవీ ‘జవాన్’ పై మరింతగా క్రేజ్ పెరిగిపోయింది. దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా ఫ్యాన్స్ కు ఎక్సయిటింగా అనిపిస్తోంది. ‘పఠాన్’ మూవీతో షారుఖ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి గ్రేటెస్ట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. బాలీవుడ్ బాక్పాఫీస్ వద్ద ఇప్పటివరకు మొత్తం 1033 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటుకుంది. ఈ క్రమంలో షారుఖ్ నెక్స్ట్ మూవీ జవాన్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. అంచనాలు మరింత పెరిగాయి.

తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో షారుఖ్, నయనతార జంటగా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా మరోసారి అదరగొట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలోని క్యామియో రోల్ ను మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయించబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. జవాన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తాడని కొన్ని రోజుల క్రితం న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు అదే రోల్ చరణ్ ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ గెస్ట్ పాత్రని తమిళంలో విజయ్ తో చేయిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తుంది.

డైరెక్టర్ అట్లీ విజయ్ కి మూడు హిట్స్ ఇచ్చాడు. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. దీంతో షారుఖ్ జవాన్ పాన్ ఇండియా రిలీజ్ అవుతుండటంతో లోకల్ మార్కెట్ కోసం గెస్ట్ అప్పీరెన్స్ కి తమిళ్ లో విజయ్ ని తీసుకొస్తున్నాడు. తెలుగులో అల్లు అర్జున్ అనుకున్నా బన్నీ నో చెప్పాడని సమాచారం. దీంతో రామ్ చరణ్ ని తీసుకోవాలని భావిస్తున్నారట జవాన్ చిత్రయూనిట్. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో అమెరికాలో ఉన్న చరణ్ ఇండియా తిరిగి రాగానే కలిసి ఈ పాత్ర గురించి నేరేట్ చేయనున్నాడట అట్లీ. దీంతో బన్నీ నో చెప్పిన రోల్ మరి చరణ్ ఒప్పుకుంటాడా చూడాలి.

Ram Charan : సల్మాన్ సినిమాలో చరణ్ స్టెప్పులు.. పూర్తిగా సౌత్ సినిమాగా మారిపోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్..

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో RC15 లో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 27న చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ చరణ్ సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకీ జాన్ మూవీలోనూ క్యామియో రోల్ చేస్తున్నాడు. ఒక పాటలో సల్మాన్ తో కలిసి స్టెప్పులెయ్యబోతున్నాడు. ఇప్పుడు షారుఖ్ జవాన్ లోనూ అతడు క్యామియో రోల్ చేస్తాడు అని సమాచారం రావడంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. జవాన్ సినిమాని జూన్ లో రిలీజ్ చేస్తారని గతంలోనే ప్రకటించారు.