మీకు కాళ్లూ చేతులు లేవా.. ఆకతాయికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన రష్మీ..

వీధి కుక్కలకు ఆహారమందించి మంచి మనసు చాటుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..

  • Edited By: sekhar , April 7, 2020 / 09:56 AM IST
మీకు కాళ్లూ చేతులు లేవా.. ఆకతాయికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన రష్మీ..

వీధి కుక్కలకు ఆహారమందించి మంచి మనసు చాటుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతేనో నిత్యావసరాలకోసమో తప్ప ఎవరూ బయటకి రావడంలేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో మూగ జీవాలను గురించి పట్టించుకునే నాధుడు లేడు. దీంతో అవి ఆహారం లేక అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కలు తినడానికి ఏమీ దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ వాహనాలు కనబడితే వాటివెంట పరిగెడుతున్నాయి.

Rashmi Gautham Feed Street Dogs

వీధి కుక్కల దుస్థితికి చలించిపోయిన బుల్లితెర యాంకర్ రష్మీ తానే స్వయంగా రంగంలోకి దిగి కొన్ని కుక్కలకు ఆహారం, నీళ్లు అందించింది. అందరూ సమీపంలో ఉన్న మూగ జీవాలకు ఆహారం అందించాలని విజ్ఞప్తి చేసింది. రష్మీ చేసిన పనికి అందరూ అభినందిస్తుంటే ఓ ఆకతాయి మాత్రం ‘రోడ్డు మీద ఉన్న కుక్కలకు ఫుడ్ పెడుతున్నావ్ మంచిదే.. మా ఇంటి పైన ఓ కుక్క ఉంది దానికి కూడా పెడతావా.. ఊరికే అది నా ఇంటర్నెట్ కేబుల్ తింటుంది’ అని ట్వీట్ చేసాడు..

Read Also : సూపర్ స్టార్స్ ‘ఫ్యామిలీ’ షార్ట్ ఫిల్మ్

‘మీకు కాళ్లు చేతులు లేవా.. కొంచెం రైస్ పెడితే మీ ఆస్తి మొత్తం పోతుందా.. మీకంటే పేదవాళ్లు వెయ్యిరెట్లు బెటర్.. వాళ్లు తినే ఒక రోటీలో కూడా సగం పక్షులకు పెడతారు.. మీరేమో ఇంటర్నెట్ కేబుల్ గురించి టెన్షన్ పడుతున్నారు’ అంటూ రష్మీ గట్టిగా ఇచ్చింది.