Ravanasura : తనలోని రావణాసురుడిని ఆ రోజే పరిచయం చేస్తాను అంటున్న రవితేజ..

రవితేజ (Raviteja) ప్రస్తుతం రావణాసుర (Ravanasura) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కి రవితేజ ముహూర్తం ఫిక్స్ చేశాడు.

Ravanasura : తనలోని రావణాసురుడిని ఆ రోజే పరిచయం చేస్తాను అంటున్న రవితేజ..

Raviteja fix the date for Ravanasura trailer release

Ravanasura : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ధమాకా సినిమాతో తనలో ఫ్యాన్స్ మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ ని మళ్ళీ మరోసారి ఆడియన్స్ కి పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం కాకుండా, కెరీర్ లోనే మొదటిసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుపెట్టాడు. ఈ మూవీ తరువాత వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నాడు. ప్రస్తుతం రావణాసుర (Ravanasura) అనే సినిమాలో నటిస్తున్నాడు. హీరోస్ డోంట్ ఏక్సిస్ట్ అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్న ఈ మూవీని సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

Tiger Nageswara Rao : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టైగర్ నాగేశ్వరరావు..

సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అంటూ ఒకొకటిగా విడుదల చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. మార్చి 28 సాయంత్రం 4:05 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మేఘా ఆకాశ్, అను ఇమ్మాన్యుయెల్ (Anu Emmanuel), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ అందాల తారలు ఈ సినిమాలో మెరబోతున్నారు.

Raviteja : తమ్ముడి కొడుకుని లాంచ్ చేసిన రవితేజ.. పెళ్లి సందD డైరెక్టర్ తో..

హర్షవర్ధన్ రామేశ్వర్, భీమస్ సెసిరోలె ఈ మూవీకి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ నామాతో కలిసి రవితేజ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా పై రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఈ మూవీతో కూడా రవితేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంటాడా? లేదా? చూడాలి.