RC15: చరణ్ పుట్టినరోజు కానుకగా అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తోన్న శంకర్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

RC15: చరణ్ పుట్టినరోజు కానుకగా అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తోన్న శంకర్..?

RC15 Movie Update On Ram Charan Birthday

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

RC15 shooting Leaks : RC15కు ఆగని లీకుల బెడద.. ఏం చెయ్యాలో తెలియక దిల్ రాజు..

ఈ క్రమంలో ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన లీక్ ఫోటోలను అభిమానులు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అఫీషియల్‌గా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా చూస్తున్నారు. అయితే, చరణ్ 15వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మార్చిలోనే ఈ పోస్టర్‌ను రిలీజ్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ ట్రీట్ ఇచ్చేందుకు శంకర్ అండ్ టీమ్ రెడీ అవుతోందట.

RC15: చరణ్ హైదరాబాద్ టు వైజాగ్.. వయా కర్నూల్..!

మార్చి 27న చరణ్ పుట్టినరోజు ఉండటంతో, RC15 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. కాగా మార్చి 26న ఈ చిత్రం నుండి అప్డేట్ రాబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.