Romantic : ‘రొమాంటిక్’ సెట్ లోంచి పారిపోదాము అనుకున్నా : ఆకాష్ పూరి

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆకాష్ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో తన గురించి, ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Romantic :  ‘రొమాంటిక్’ సెట్ లోంచి పారిపోదాము అనుకున్నా : ఆకాష్ పూరి

Akash

Romantic : పూరి జగన్నాధ్ తనయుడు రొమాంటిక్ సినిమాతో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇటీవల ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ ఈవెంట్ లో ఆకాష్ చాలా బాగా మాట్లాడాడు. ఆకాష్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది ఈవెంట్లో. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆకాష్ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో తన గురించి, ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Rajinikanth : రజినీకాంత్ కి ఈ పని రాదు.. అందుకే కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్..

రొమాంటిక్ సినిమాలో రొమాన్స్ కొంచెం ఎక్కువే ఉందని వాళ్ళ నాన్నతో రొమాన్స్ తగ్గించమని చెప్తే ఒప్పుకోలేదని చెప్పాడు. ఏం చేయమంటే అది చేస్తాను, దూకమంటే దూకుతాను, కానీ ఈ రొమాన్స్ కొంచెం తగ్గించు నాన్నా అని బతిమాలాను అని చెప్పాడు. కానీ పూరి సినిమా పేరే ‘రొమాంటిక్’.. అందులో రొమాన్స్ తగ్గించమంటావ్ ఏంట్రా అని అన్నారంట. సెట్‌లో రొమాన్స్ సీన్స్ చేయడానికి చాలా సార్లు భయపడ్డాను. ఒక్కోసారి సెట్ లోంచి పారిపోవాలనిపించింది. మా నాన్న నుంచి ఎంత దూరం పారిపోతే అంత మంచిదని అనిపించింది. ఎంతో కష్టంగా ఆ రొమాన్స్ సీన్స్ పూర్తి చేసాము అని ఆకాష్ తెలిపాడు.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో చింపేసిన సిరి లేఖ ఇదే.. బయటకి రాగానే పెళ్లి చేసుకుందాం..

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళ నాన్న గురించి బాగా మాట్లాడాడు. వాళ్ళ నాన్న పడ్డ కష్టాల గురించి మాట్లాడాడు. వాటిని మళ్ళీ గుర్తు చేశాడు. ఇప్పటికే నా కోసం మా నాన్న ఎంతో చేశారు. ఎన్నో డబ్బులు పెట్టారు. ఇంత వరకు మా నాన్న చేసింది చాలు. ఇక నేను మా నాన్నకు చేయాలి. తిరిగి ఇవ్వాలి. నేను సక్సెస్ కొట్టాక అప్పుడు వెళ్లి మా నాన్నతో ఓ సినిమా చేస్తాను అప్పటిదాకా చేయను అని తెలిపాడు. భవిష్యత్తులో దర్శకత్వం కూడా వహిస్తాను కాని కథ మాత్రం మా నాన్న దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను అని తెలిపాడు.