Film Shooting : అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్

సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములు వంటి సన్నివేశాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం.. ఈ సన్నివేశాలను ఏకంగా అంతరిక్షంలోనే చిత్రీకరించాలని నిర్ణయించింది.

Film Shooting : అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్

Space

film shooting in space : సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములు వంటి సన్నివేశాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం.. ఈ సన్నివేశాలను ఏకంగా అంతరిక్షంలోనే చిత్రీకరించాలని నిర్ణయించింది. అంతేకాదు.. షూటింగ్‌ కోసం ఆ సినిమా డైరెక్టర్‌, హీరోయిన్‌ ప్రత్యేక వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపింది.

ది ఛాలెంజ్‌ అనే సినిమా షూటింగ్‌ కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్‌ షిపెంకో, హీరోయిన్‌ యులియా పెరెసిల్డ్‌ అంతరిక్షానికి చేరుకున్నారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్‌ ఎంఎస్‌19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్‌ ష్కాప్లెరోవ్‌తో కలిసి ఐఎస్‌ఎస్‌ వెళ్లారు. కజకిస్థాన్‌లోని బైకోనుర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

Face Book: ఫేస్‌బుక్‌కు మరో షాక్.. ఆదాయంపై భారీ ఎఫెక్ట్??

డైరెక్టర్‌, హీరోయిన్‌ 12 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అంతరిక్ష కేంద్రంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్‌ ఐఎస్‌ఎస్‌కు వెళ్లే సన్నివేశం అది. సినిమాలో ఈ సీన్‌ దాదాపు 35 నుంచి 40 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన యులియా కొంతకాలం శిక్షణ కూడా తీసుకున్నారు.

ఈ షూటింగ్‌ పూర్తయితే అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం రష్యానే కానుంది. గతేడాది ప్రముఖ హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కూడా స్పేస్‌లో షూటింగ్‌ చేయనున్నట్లు ప్రకటించాడు. అందుకోసం నాసా, స్పేస్‌-ఎక్స్‌ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.