Salman Khan: సల్మాన్ కొత్త మూవీ టీజర్ వచ్చేది ఆ రోజే..!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ కామెడీ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సల్మాన్ తన హవా కొనసాగించాలని గట్టిగా ప్రయ్నతిస్తున్నాడు.

Salman Khan: సల్మాన్ కొత్త మూవీ టీజర్ వచ్చేది ఆ రోజే..!

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ కామెడీ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సల్మాన్ తన హవా కొనసాగించాలని గట్టిగా ప్రయ్నతిస్తున్నాడు.

Salman Khan : సల్మాన్‌ని కలిసేందుకు 1100కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన వీరాభిమాని..

అయితే, ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమా టీజర్‌ను కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’ మూవీకి జోడించి ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Salman Khan : సల్మాన్ ఖాన్‌కి వెంకీ మామ బర్త్ డే విషెస్.. వైరల్ అవుతున్న ఫోటో!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఫర్హద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఈద్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.