Samantha: చైతూ-సామ్ డైవర్స్.. విడివిడిగా ఎమోషనల్ బిస్కెట్స్!

సమంతా ఎప్పుడెలా ఉంటుందో అర్ధం కావట్లేదు. తన బిహేవియర్ అస్సలు అంతుపట్టట్లేదు. మొన్నటికి మొన్న చైకి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో తుడిచేసింది. నువ్వేవరో నేనెవరో అన్నట్టు..

Samantha: చైతూ-సామ్ డైవర్స్.. విడివిడిగా ఎమోషనల్ బిస్కెట్స్!

PC - Samantha instagram

Samantha: సమంతా ఎప్పుడెలా ఉంటుందో అర్ధం కావట్లేదు. తన బిహేవియర్ అస్సలు అంతుపట్టట్లేదు. మొన్నటికి మొన్న చైకి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో తుడిచేసింది. నువ్వేవరో నేనెవరో అన్నట్టు ఫోజులు కొట్టింది. ఇప్పుడు చూస్తే మళ్లీ అక్కినేని హీరోలకు విడివిడిగా ఎమోషనల్ బిస్కెట్స్ వేస్తోంది. అసలేం జరుగుతోంది.. సామ్ మళ్లీ చైతన్యకు దగ్గరవ్వాలనుకుంటుందా..?

Samantha: సమంత స్వీట్ విషెస్.. అఖిల్ సైలెన్స్!

ఏప్రిల్ 8న అల్లు అర్జున్, అక్కినేని అఖిల్ బర్త్ డే. ఫ్యాన్స్ తో పాటు, సెలబ్రిటీస్ చాలామంది వాళ్లకు విషెస్ అందించారు. అందులో సమంత అందించిన విషెస్ హాట్ టాపిక్ గా మారింది. ముందుగా అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ అందించిన సామ్.. ఆ తర్వాత తన ఇన్ స్టాలో సమంత బెస్ట్ విషెస్ కామెంట్ పెట్టి, అఖిల్ ఫోటో షేర్ చేసింది. దాంతో సామ్ ఫాలోవర్స్ షాకయ్యారు. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం సామ్, చైతూలు మళ్లీ కలిస్తే బావుంటుందని కామెంట్స్ కూడా పెట్టారు.

Samantha : బాలీవుడ్‌‌కి మకాం.. ముంబైలో ఇల్లు కొంటున్న సమంత..

సమంత ఏం చేసినా, ఏం చేయబోతున్నా సోషల్ మీడియా ఫాలోవర్స్ కి ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే నాగచైతన్యతో విడిపోవడానికి ముందే సోషల్ మీడియాలో పేరు మార్చుకుని, ముందుగానే డివోర్స్ సంకేతాలిచ్చింది. చైతూతో విడిపోగానే సోషల్ మీడియాలో ఇద్దరి జ్నాపకాలను డిలీట్ చేసి, చైతు పైన తన ఫీలింగ్ రివీల్ చేసింది. కానీ, ఇప్పుడు రెండు రోజుల ముందే మజిలీ సినిమాలో చైతూ పోస్టర్ ను ఇన్ స్టాలో పెట్టి ఫాలోవర్స్ తో పాటు, అక్కినేని ఫ్యాన్స్ కు మరో సారి షాకిచ్చింది.

Naga Chaitanya-Samantha: చైతూ జ్ఞాపకాలను తుడిచేస్తున్న సామ్!

టాలీవుడ్ క్యూట్ జోడీగా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడిపోయి దాదాపు 6 నెలలు కావొస్తుంది. విడిపోయిన తర్వాత స్నేహితులుగా ఉంటామన్నారు కానీ, దూరం పెంచుకున్నారు. అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య తో తప్ప అఖిల్, నాగార్జునతో టచ్ లోనే ఉందని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే తన సోషల్ మీడియా ఫాలోవర్స్ లిస్ట్ నుంచి చైతూని డిలీట్ చేసిన సమంత నాగార్జునను అన్ ఫాలో చేయలేదు. ఇప్పుడు అఖిల్ కు బర్త్ డే విషెస్ కూడా అందించింది. అంటే మళ్లీ సమంతకు అక్కినేని ఫ్యామిలీ పట్ల ఇష్టం పెరుగుతుందన్నట్టే కదా, ఈ రకంగానైనా మళ్లీ సామ్, అక్కినేని ఫ్యామిలీతో కలిసి పోవాలనుకుంటుందా అని, అటు సమంత, ఇటు అక్కినేని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.