Gurtunda Seetakalam: గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. ఫీల్‌గుడ్ కథతో దిగుతున్న సత్యదేవ్!

టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటించి ప్రేక్షకులను తన పర్ఫార్మెన్స్‌తో మంత్రముగ్ధులను చేశాడు. ఇక ఈ యాక్టర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Gurtunda Seetakalam: గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. ఫీల్‌గుడ్ కథతో దిగుతున్న సత్యదేవ్!

Satyadev Tamannaah Gurtunda Seetakalam Trailer Very Impressive

Gurtunda Seetakalam: టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటించి ప్రేక్షకులను తన పర్ఫార్మెన్స్‌తో మంత్రముగ్ధులను చేశాడు. ఇక ఈ యాక్టర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Gurthunda Seetakalam: మరోసారి డేట్ మార్చుకున్న గుర్తుందా శీతాకాలం.. ఈసారి ఎప్పుడంటే?

ఈ సినిమాను దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కిస్తుండగా, సత్యదేవ్ సరసన అందాల భామ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రానున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సత్యదేవ్ భార్యగా తమన్నా తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనుంది.

Gurthunda Seethakalam: శీతాకాలం రాకముందే వస్తోన్న ‘గుర్తుందా శీతాకాలం’

ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సత్యదేవ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.