Jai Bheem : ‘జై భీమ్’ సినిమాపై సీతక్క ట్వీట్.. రిప్లై ఇచ్చిన సూర్య

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క.. హీరో సూర్యకు ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలియజేశారు. ‘జై భీమ్‌ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచి అవార్డు

Jai Bheem : ‘జై భీమ్’ సినిమాపై సీతక్క ట్వీట్.. రిప్లై ఇచ్చిన సూర్య

Seethakka

Jai Bheem :  తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన చిత్రం ‘జై భీమ్‌’. ఇటీవల దీపావళికి ఓటిటిలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది ఈ సినిమా. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులకి ప్రశంశలు అందుతున్నాయి. ఇలాంటి సినిమాని ఎంచుకున్నందుకు సూర్యని కూడా పొగుడుతున్నారు. ఈ సినిమాని సూర్య నిర్మించడం విశేషం.

Bigg Boss 5 : కెప్టెన్సీ టాస్కుతో మరోసారి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్

ఓ గిరిజయన యువకుడిని అన్యాయంగా చంపితే ఆమె భార్య తరపున ఈ కేసుని వాదించే లాయర్ గా సూర్య ఇందులో నటించాడు. జస్టిస్ చంద్రు జీవిత చరిత్రను, అందులోని ఒక కేసుని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు ఈ సినిమాని. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి, హీరో సూర్య, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Shalu Chaurasia : ఫోన్ మాత్రమే కాదు డైమండ్ రింగ్ కూడా ఎత్తుకెళ్లారు.. లైంగిక దాడికి యత్నించాడు : చౌరాసియా

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క.. హీరో సూర్యకు ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలియజేశారు. ‘జై భీమ్‌ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచి అవార్డు సాధిస్తుందని ఆశిస్తున్నా. చిత్రం బృందానికి ముందస్తుగా నా అభినందనలు’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌కు హీరో సూర్య స్పందించారు. ‘కృతజ్ఞతలు మేడం.. మా చిత్రం బృందం తరఫున మీకు కృతజ్ఞతలు’ అని సూర్య రిప్లై ఇచ్చారు.

Puneeth Rajkumar : పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం

సీతక్క కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అడవుల్లో ఉండే గిరిజనుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలని తెలుసుకొని, వారికి సహాయం చేస్తున్నారు. ఈ సినిమా కూడా గిరిజనుల కథతో తీయడంతో సీతక్క సినిమా చూసి అభినందించారు. సీతక్కకు జనాల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది. కరోనా సమయంలో కూడా ఎన్నో మంచి పనులు, ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొందారు. ఇలాంటి సినిమాని చూసి అభినందించడంతో మరోసారి ఆమెపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.