Shah Rukh Khan : అభిమానిని నెట్టేసిన షారుఖ్.. వీడియో వైరల్!

డంకీ షూటింగ్ పూర్తి చేసుకొని కాశ్మీర్ నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ చేరుకున్న షారుఖ్.. సెల్ఫీ అడిగిన అభిమానిని పక్కకి నెట్టేశాడు.

Shah Rukh Khan : అభిమానిని నెట్టేసిన షారుఖ్.. వీడియో వైరల్!

Shah Rukh Khan Misbehave With Fan at mumbai airport

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన ఈ భారీ సక్సెస్ ని అలాగే ముందుకు తీసుకు వెళ్లేలా తదుపరి సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డంకీ (Dunki) కోసం గత వారం షారుఖ్ కాశ్మీర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడి నుంచి ముంబై తిరిగి వచ్చాడు.

Jawan : షారుఖ్ ‘జవాన్’ సినిమా విషయంలో.. హైకోర్టు కీలక ఆదేశాలు!

ఇక ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన షారుఖ్ కి స్వాగతం పలికేందుకు కొంతమంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లోపల నుంచి బయటికి వస్తున్న షారుఖ్ తో సెల్ఫీ తీసుకునేందుకు ఒక అభిమాని ట్రై చేశాడు. అయితే షారుఖ్ అతడి చేతిని పక్కకి నెట్టేశాడు. సెల్ఫీ ఇవ్వడానికి నిరాకరించి అక్కడి నుంచి కారులో ఎక్కి వెళ్ళిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Nayanthara: జోరుగా ‘జవాన్’ వాయిదా వార్తలు.. నయన్ ఎంట్రీతో ఫుల్‌స్టాప్..!

డంకీ సినిమా విషయానికి వస్తే.. 3 ఇడియట్స్, PK, సంజు వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడంతో ఆడియన్స్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. సెన్సిబుల్ స్టోరీని ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా, గుండెకు హత్తుకునేలా తెరకెక్కించడంలో హిరానీ నేర్పరి. ఇక ఈ సినిమా ఆర్మీ నేపథ్యంతో ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే దుబాయ్, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంతో పాటు అట్లీ దర్శకత్వంలో జవాన్ (Jawan) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తుండగా విజయ్, దీపికా, సంజయ్ దత్త్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.