Pathaan : బంగ్లాదేశ్‌కి స్వతంత్రం వచ్చిన తరువాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా.. పఠాన్!
షారుఖ్ పఠాన్ సినిమా ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలుసు. తాజాగా ఈ మూవీ ఇప్పుడు అరుదైన రికార్డుని సొంతం చేసుకుంటుంది. 1979లో పాకిస్తాన్ నుంచి స్వతంత్రం..

Shah Rukh Khan Pathaan is the first hindi movie to be released in bangladesh
Pathaan : బాలీవుడ్ కష్ట కాలంలో ఉన్న సమయంలో పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించి హిందీ పరిశ్రమను ఆదుకొని షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) మరోసారి బాలీవుడ్ బాద్‌షా అనిపించుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల పైగా కలెక్షన్స్ ని అందుకొని హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసింది. అయితే ఈ కలెక్షన్స్ సునామీని కొనసాగించేందుకు ఇప్పుడు బాంగ్లాదేశ్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.
Shah Rukh Khan : అభిమానిని నెట్టేసిన షారుఖ్.. వీడియో వైరల్!
1979లో పాకిస్తాన్ నుంచి స్వతంత్రం సంపాదించుకున్న దగ్గర నుంచి బంగ్లాదేశ్ లో ఇప్పటి వరకు హిందీ సినిమా రిలీజ్ కాలేదు. ఇప్పుడు పఠాన్ రిలీజ్ అవుతూ మొదటి సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. మే 12 నుంచి ఈ సినిమా బంగ్లాదేశ్ ఆడియన్స్ ని అలరించబోతుంది. కాగా పఠాన్ విడుదల సమయంలో షారుఖ్ అభిమానులతో ట్విట్టర్ లో చిట్ చాట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఇంటరాక్షన్ లో ఒక బంగ్లా అభిమాని.. “పఠాన్ సినిమాని బంగ్లాదేశ్‌లో కూడా రిలీజ్ చేయవచ్చు కదా” అని అడిగాడు.
Jawan : షారుఖ్ ‘జవాన్’ సినిమా విషయంలో.. హైకోర్టు కీలక ఆదేశాలు!
దానికి షారుఖ్ బదులిస్తూ.. “త్వరలోనే బంగ్లాదేశ్ లో నువ్వు పఠాన్ సినిమా చూస్తావు” అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో అభిమానికి ఇచ్చిన మాటని షారుఖ్ నిలబెట్టుకున్నాడని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా షారుఖ్ ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీలో డంకీ (Dunki), తమిళ డైరెక్టర్ అట్లీతో జవాన్ (Jawan) సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే కాశ్మీర్ లో డంకీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న షారుఖ్.. జవాన్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యినట్లు తెలుస్తుంది. మరి పఠాన్ తో వచ్చిన సక్సెస్ ని ఈ రెండు సినిమాలతో కంటిన్యూ చేస్తాడా? లేదా? చూడాలి.
#Pathaan Becomes The First Hindi Film To Release In Bangladesh Since 1971 🔥
Finally #Pathaan Release In 12th May.. Congratulations For Bangladesh SRK Fans 🔥 pic.twitter.com/pXKSDFZPmk
— 😎Sourav Srkian Das😎 (@SrkianDas04) May 5, 2023