Aditi Shankar: శంకర్ కూతురు హీరోయిన్.. బాధ్యత తీసుకున్న సూర్య!

సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ చిన్న కుమార్తె ఆదితీ శంకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే.. తండ్రి శంకర్ సినిమాతో ఈ ఎంట్రీ ఇవ్వడం లేదు.

Aditi Shankar: శంకర్ కూతురు హీరోయిన్.. బాధ్యత తీసుకున్న సూర్య!

Aditi Shankar

Aditi Shankar: సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ చిన్న కుమార్తె ఆదితీ శంకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే.. తండ్రి శంకర్ సినిమాతో ఈ ఎంట్రీ ఇవ్వడం లేదు. కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న విరుమన్ సినిమాలో అదితీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక దంపతులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అదితికి స్వాగతం చెప్పిన సూర్య ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు గెలుచుకుంటావని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘అదితీని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ధన్యవాదాలు. ఫుల్‌ ప్రిపరేషన్‌తో వస్తున్న అదితీని ఆదరిస్తారనే ఆశిస్తున్నానన్నారు శంకర్‌. ‘అవకాశం ఇచ్చిన సూర్య, జ్యోతికలకు థ్యాంక్స్‌. వందశాతం కష్టపడి మీరు గర్వపడేలా చేస్తా’నని అదితి తెలిపింది. కార్తీ హీరోగా అన్న సూర్య నిర్మాణంలో శంకర్ కూతురు హీరోయిన్ గా మారడంతో ఇప్పుడు సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో ఇదే చర్చ జరుగుతుంది.

హిందీ పరిశ్రమలో వారసురాళ్ల ఎంట్రీ చాలా సాధారణంగా మారిపోగా సౌత్ లో పరిశ్రమకు చెందిన హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతల కూతుర్లు హీరోయిన్స్ గా మాదిరిన సందర్భాలు చాలా అరుదు. శృతి హాసన్, నిహారిక కొణిదెల ఇలా చెప్పుకోవడానికి చాలా తక్కువ పేర్లు ఉన్నాయి. అయితే.. ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతుంది. వారసురాళ్ల హవా కూడా మొదలవుతుంది. మరి శంకర్ లాంటి క్రేజీ స్టార్ డైరెక్టర్ వారసురాలిగా అదితి అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాల్సిఉంది.