The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్ టీఆర్పీ రేటింగ్.. మరీ అంతా..?

ఈయేడు బాలీవుడ్‌లో రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే పలు రికార్డులను తన పేరిట రాసుకున్న ఈ సినిమాకు బుల్లితెరపై మాత్రం ఊహించని షాక్ తగిలింది.

The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్ టీఆర్పీ రేటింగ్.. మరీ అంతా..?

Shocking TRP For The Kashmir Files Telugu Version

The Kashmir Files: ఈయేడు బాలీవుడ్‌లో రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. కశ్మీర్‌లో హిందూ పండితులపై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించగా, ప్రేక్షకులు దేశవ్యాప్తంగా ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయగా, అందులోనూ ప్రేక్షకులు ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు.

The Kashmir Files: ఓటీటీలో డేట్ లాక్ చేసుకున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’

అయితే పలు రికార్డులను తన పేరిట రాసుకున్న ఈ సినిమాకు బుల్లితెరపై మాత్రం ఊహించని షాక్ తగిలింది. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెలుగు వర్షన్‌లో ఇటీవల బుల్లితెరపై ప్రీమియర్‌గా వేశారు. ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వర్షన్‌ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు టీఆర్పీ రేటింగ్ చాలా తక్కువ స్థాయిలో రావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు తెలుగు వర్షన్‌లో బుల్లితెరపై కేవలం 1.35 టీఆర్పీ రేటింగ్ రావడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

The Kashmir Files: మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో చెడుగుడు ఆడేసిన ది కశ్మీర్ ఫైల్స్ తెలుగు వర్షన్ మూవీకి ఈ రేంజ్‌లో టీఆర్పీ రేట్ లభిస్తుందని ఎవరూ ఊహించలేనిది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఓటీటీలో చాలా మంది ప్రేక్షకులు చూడటమే దీనికి కారణం అయ్యి ఉండొచ్చని పలువురు మూవీ లవర్స్ అంటున్నారు. ఏదేమైనా ది కశ్మీర్ ఫైల్స్ మూవీకి ఇలాంటి టీఆర్పీ రేటింగ్ రావడంతో అందరూ విస్మయానికి గురయ్యారని చెప్పాలి. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషిలు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించగా, జీ స్టూడియోస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.