MAA Elections: ‘మా’ ఎన్నికల బరిలో సోనూసూద్.. నిజమెంత?

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మా ఎన్నికలే హాట్ టాపిక్. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాల విడుదల ఏంటి? సినిమా భవిష్యత్ ఏంటి అన్న దానిని మించి.. మా కాబోయే అధ్యక్షుడు ఎవరు.. ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనేదే ఇప్పుడు తీవ్రంగా జరిగే చర్చ. త్వరలోనే మా ప్యానల్ ఎన్నికలు జరగనున్నాయని ప్రచారం మొదలవగానే నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించాడు.

MAA Elections: ‘మా’ ఎన్నికల బరిలో సోనూసూద్.. నిజమెంత?

Maa Elections

MAA Elections: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మా ఎన్నికలే హాట్ టాపిక్. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాల విడుదల ఏంటి? సినిమా భవిష్యత్ ఏంటి అన్న దానిని మించి.. మా కాబోయే అధ్యక్షుడు ఎవరు.. ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనేదే ఇప్పుడు తీవ్రంగా జరిగే చర్చ. త్వరలోనే మా ప్యానల్ ఎన్నికలు జరగనున్నాయని ప్రచారం మొదలవగానే నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించాడు. అలానే ప్రస్తుతం ప్యానల్ అనుకున్న స్థాయిలో పనిచేయలేదని విమర్శలు విసిరారు.

అదలా ఉండగానే మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు కూడా ఎన్నికలకు దిగనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్, ప్యానల్ తో సహా మీటింగ్ పెట్టి విమర్శించిన ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చారు. దీంతో రసాభాసగా మారిన మా ఎన్నికలలో అంశంలో మురళి మోహన్, చిరంజీవి, మోహన్ బాబు వంటి వారు కల్పించుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు కృషి చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ అంతలోనే ప్రకాష్ రాజ్, నరేష్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి.

అయితే.. ఇప్పుడు అదలా ఉండగానే మా ఎన్నికలలో బరిలో మరో వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది. కరోనా ఆపదసమయంలో అడిగిన వారికి లేదనకుండా సాయం అందిస్తూ దేవుడిగా మారిన సోనూసూద్ కూడా మా ఎన్నికల బరిలో దిగనున్నారని సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు పోటీగా సోనూసూద్ ను రంగంలోకి దింపేందుకు కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నట్లుగా కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు.

అయితే.. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఇది ఏ మాత్రం నిజం కాదని పెద్దలు చెప్తున్నారు. ఇప్పటికీ ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకొనేలా పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది. అసలు ప్రస్తుతానికి కరోనా వలన ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది కూడా నిర్ధారించలేని పరిస్థితి నెలకొందని.. ఇలాంటి పరిస్థితిలో ఎవరు ఎన్నికలలో పోటీచేయనున్నారన్నది కూడా అర్ధంలేని ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు.