Film Release Clash: సౌత్ వర్సెస్ నార్త్, నీ ప్రతాపమో.. నా ప్రతాపమో!

ఇన్నాళ్లూ వెయిట్ చేసి అందరూ ఒకేసారి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడంతో సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రిలీజ్ క్లాష్ ఎదురవుతోంది. సౌత్ లో నార్త్ క్రేజ్, నార్త్ లో కూడా సౌత్ క్రేజ్..

10TV Telugu News

Film Release Clash: ఇన్నాళ్లూ వెయిట్ చేసి అందరూ ఒకేసారి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడంతో సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రిలీజ్ క్లాష్ ఎదురవుతోంది. సౌత్ లో నార్త్ క్రేజ్, నార్త్ లో కూడా సౌత్ క్రేజ్ పెరగడంతో ఒకేసారి రిలీజ్ కి రెడీ అవ్వుతున్న సినిమాల విషయంలో డైలమాలో పడుతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు సౌత్ వర్సెస్ నార్త్ తో స్టార్లు కూడా నీ ప్రతాపమో, నా ప్రతాపమో అంటూ ధియేటర్లో తేల్చుకోబోతున్నారు.

Jr NTR: పవన్ సినిమాల్లో తారక్‌కి ఇష్టమైన సినిమా ఇదే..!

అంతకుముందు సౌత్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకు, అటు బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకు పెద్ద పోటీ కానీ, పోలిక కానీ ఉండేది కాదు. సౌత్, నార్త్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అంటూ అందరూ కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. అందులోనూ సెకండ్ వేవ్ తర్వాత సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ కి రావడంతో రిలీజ్ క్లాష్ ఫేస్ చేస్తున్నాయి. ఈ సంవత్సరం సౌత్ వర్సెస్ నార్త్ లో పోటీ పడుతున్న సినిమాలు 83, శ్యామ్ సింగరాయ్. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రణవీర్ సింగ్, దీపికా నటిస్తున్న 83 మూవీ, నాని-సాయిపల్లవి, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమా.. ఈరెండు డిసెంబర్ 24నే రిలీజ్ అవుతున్నాయి.

Film Releases: కళకళలాడుతున్న థియేటర్లు.. ఈ వారం సినిమాలివే!

అసలు బిగ్గెస్ట్ సౌత్ వర్సెస్ నార్త్ క్లాష్ ఏప్రిల్ లో స్టార్ట్ అవుతోంది. ఇప్పటికే సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న కెజిఎఫ్ 2 సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అదే రోజు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, నాగ చైతన్య లీడ్ రోల్స్ లో తెరకెక్కిన లాల్ సింగ్ చడ్హా కూడా రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కి షిఫ్ట్ అవ్వడం, కెజిఎఫ్ ని క్లాష్ చెయ్యడం ఇష్టంలేకపోయినా.. వేరే దారి లేక ఏప్రిల్ 14నే ధియేటర్లోకి వస్తున్నామని క్లారిటీ ఇచ్చారు అమీర్ ఖాన్.

Film Promotions: ప్రమోషన్లతో మోత మోగించేస్తున్న స్టార్ మూవీస్

టైగర్ ష్రాఫ్ హీరోపన్తి 2, అజయ్ దేవ్ గన్ మేడే సినిమా ఏప్రిల్ 29న ఈద్ సీజన్ లో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. వీళ్లే కాకుండా ప్రతి ఈద్ కి కంపల్సరీ గా సినిమా రిలీజ్ చేసే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3ని ఈద్ కి రిలీజ్ చెయ్యాలనుకుంటే అది నెవర్ బిఫోర్ క్లాష్ అవ్వడంతో ఏమాత్రం డౌట్ లేదు. వీటికి తోడు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో వస్తున్న హరిహరవీరమల్లు ఆల్రెడీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుని ఏప్రిల్ 29నే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సో..ఈ డేట్ న మాత్రం సౌత్ వర్సెస్ నార్త్ వార్ లో ఎవరు గెలుస్తారన్నది ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది.

RRR: విజువల్ ట్రీట్.. హాట్ టాపిక్‌గా మారిన రన్ టైం..!

సౌత్ వర్సెస్ నార్త్ లో మరో బిగ్గెస్ట్ క్లాష్ ప్రబాస్ కి, అక్షయ్ కుమార్ కి. ఓమ్ రౌత్-ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఆదిపురుష్, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాలు ఆగస్ట్ 11న రిలీజ్ అవుతున్నాయి. ఆదిపురుష్ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవ్వడమే కాకుండా.. ఆదిపురుష్ ని డైరెక్ట్ చేస్తున్నది బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్. దాంతో ఈ రెండూ రిలీజ్ క్లాష్ గట్టిగానే ఫేస్ చేస్తున్నాయి.