Theater Release Films: జోరు తగ్గిన స్టార్స్..ఈ వారం సంపూ, రాజ్ తరుణ్‌లదే!

ఈ వారం టాలీవుడ్ లో రిలీజ్ ల జోరు కాస్త తక్కువగానే ఉంది. థియేటర్ బిజినెస్ ఊపందుకున్నాక యంగ్ హీరోలు కాస్త గట్టిగానే పోటీపడ్డా.. ఈ వీక్ మాత్రం టాలీవుడ్ లో కొంచెం పేరున్న హీరో..

Theater Release Films: జోరు తగ్గిన స్టార్స్..ఈ వారం సంపూ, రాజ్ తరుణ్‌లదే!

Theater Release Films

Theater Release Films: ఈ వారం టాలీవుడ్ లో రిలీజ్ ల జోరు కాస్త తక్కువగానే ఉంది. థియేటర్ బిజినెస్ ఊపందుకున్నాక యంగ్ హీరోలు కాస్త గట్టిగానే పోటీపడ్డా.. ఈ వీక్ మాత్రం టాలీవుడ్ లో కొంచెం పేరున్న హీరో రాజ్ తరుణ్ మాత్రమే దిగుతున్నాడు. అయితే బాలీవుడ్ లో మాత్రం బిగ్ రిలీజెస్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. డిసెంబర్ నుంచే అసలైన రచ్చ టాలీవుడ్ లో స్టార్ట్ కాబోతుంది. అప్పటివరకు మాత్రం థియేటర్స్ లో చిన్న సినిమాలదే హవా అన్నట్టుంది. ఈ వీక్ అనుభవించు రాజా అంటూ రాజ్ తరుణ్ సినిమా హాళ్లకు వచ్చేస్తున్నాడు.

Burj Khalifaపై సెలెబ్రిటీల హల్చల్.. ఈ కథేంటి?

మాక్సిమమ్ ఫ్లాప్స్ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా ఇది. అందుకే సినిమా సక్సెస్ పై ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడు రాజ్ తరుణ్. ట్రైలర్ కూడా కూడా బాగానే ఉంది. శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై యార్లగడ్డ సుప్రియ నిర్మించారు. అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండటంతో హిట్ గ్యారంటీ అంటున్నారు. ఉయ్యాల జంపాల తర్వాత మళ్లీ అన్నపూర్ణ బ్యానరే రాజ్ తరుణ్ ని నిలబెడుతుందనే టాక్ వినిపిస్తోంది.

RRR: నాటు పాటకి పునీత్ స్టెప్పులేస్తే.. వీడియో వైరల్!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్​ బాబు హీరోగా నటించిన మూవీ ‘క్యాలీఫ్లవర్​’. ‘శీలో రక్షతి రక్షితః’ అనే ట్యాగ్​లైన్​ తో అనే​ విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా. సంపూర్ణేశ్​ బాబు హీరోగా చేసిన.. హృదయకాలేయం, సింగం 1 2 3, కొబ్బరి మట్ట సినిమాల్లానే.. క్యాలీఫ్లవర్​ కూడా పూర్తి స్థాయి కామెడి ఎంటర్​టైనర్​గా రూపొందించారు. ఆర్కె మలినేని డైరెక్ట్ చేసాడు ఈ మూవీని. యమదొంగ, కింగ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ భామ మమతా మోహన్ దాస్. ఈమె ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ లాల్ బాగ్. ఐటీ, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రశాంత్ మురళి పద్మనాభన్ దర్శకుడు. నందిని రాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి కీ రోల్స్ చేసిన ఈ మూవీ కూడా నవంబర్ 26న థియేటర్స్ కి రాబోతుంది.

Poonam Kaur: పంజాబీ అందం పూనమ్ గ్లామర్ ట్రీట్!

జాన్ అబ్రహం లీడ్ రోల్ లో గతంలో సక్సెసైన సినిమా సత్యమేవ జయతే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘సత్యమేవ జయతే 2’ వస్తోంది. గత కొన్ని నెలలుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిలాప్జవేరీ దర్శకత్వం వహించిన సత్యమేవ జయతే2లో దివ్యా కోస్లా కూమార్లేడీ లీడ్ గా కనిపించనుంది. కాగా జాన్ ట్రిపుల్ రోల్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇప్పటికే రిలీజైన పాటలు ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేస్తున్నాయి.

NTR30: ఎన్టీఆర్, కొరటాల సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ?

సల్మాన్ ఖాన్ కీ రోల్ లో నవంబర్ 26న రాబోతుంది అంతిమ్. సల్మాన్ బావ ఆయుష్ శర్మ లీడ్ రోల్ లో కనిపించే ఈ సినిమాను మహేష్మంజ్రేకర్డైరెక్ట్ చేసారు. జీ5లో వచ్చిన ముల్షీకి సీక్వెల్ గా తన సొంత బ్యానర్ లో అంతిమ్ ను నిర్మించారు సల్మాన్. కేవలం 60రోజుల్లోనే పూర్తి చేసిన ఈ సినిమాలో తన పార్ట్ ను కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేసాడు సల్లూభాయ్. ఇక ఒక్కొక్కటిగా రిలీజైన సాంగ్స్, టీజర్స్ అన్ని ప్రేకక్షకుల్లో ఫుల్ గా ఎక్సైట్ మెంట్ క్రియేట్ చేసాయి.