పవన్ ‘పింక్’ రీమేక్ – టైటిల్, రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ - టైటిల్, రిలీజ్ డేట్ గురించి వస్తున్న రూమర్స్‌పై స్పందించిన దిల్ రాజు..

  • Published By: sekhar ,Published On : February 3, 2020 / 11:40 AM IST
పవన్ ‘పింక్’ రీమేక్ – టైటిల్, రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ – టైటిల్, రిలీజ్ డేట్ గురించి వస్తున్న రూమర్స్‌పై స్పందించిన దిల్ రాజు..

రీ ఎంట్రీతో ఫుల్ స్పీడ్ పెంచాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గతకొద్ది రోజులుగా రాజకీయాల్లో బిజీగా గడిపిన పవన్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు.. తన 26వ సినిమాగా ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ, తమిళ్ భాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బోని కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కథలో తెలుగు నేటివిటీ, పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు మార్పులు చేశారని, పవన్ పక్కన ఓ కథానాయిక కూడా ఉండబోతుందని.. మే 23న సినిమాను విడుదల చేయనున్నారని పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు స్పందించారు.

SVC

 
తాజాగా జరిగిన విలేఖరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ : ‘‘22 సంవత్సరాల క్రితం నేను ‘తొలిప్రేమ’ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ అయినప్పటి నుండి నేను ప్రొడ్యూసర్ అయితే కల్యాణ్ గారితో సినిమా చేయాలి అని నా మైండ్ లో పడిపోయింది. ఇప్ప‌టికి కుదిరింది. ‘పింక్’ సినిమాను రీమేక్ చేస్తున్నాం. ఈ సినిమా టైటిల్‌పై ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమాను మే 15న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. మే 11న ‘గ‌బ్బ‌ర్ సింగ్’ విడుద‌లైంది.

కాబ‌ట్టి స‌మ్మ‌ర్‌లోనే రావాల‌ని అనుకుంటున్నాం. టైటిల్ విష‌యంలో అధికారికంగా ఏమీ అనుకోలేదు. ఉగాదికి టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం. ‘వి’ సినిమా రిలీజ్ త‌ర్వాత ప‌వ‌న్ సినిమా ప్ర‌మోష‌న్స్ గురించి ఆలోచిస్తాం. ‘పింక్’ ని హిందీ, త‌మిళంలో చూసిన‌ట్టు కాకుండా మ‌రో కోణంలో చూపిస్తాం’’. అన్నారు. 
లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు.