Telugu Movies: మాస్ మంత్రాన్ని పలికేస్తున్న స్టార్ హీరోలు! Telugu Movies Star Heroes chanting Mass Mantra!

Telugu Movies: మాస్ మంత్రాన్ని పలికేస్తున్న స్టార్ హీరోలు!

కేజీఎఫ్, పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ తో ఇప్పుడు హీరోలందరూ మాస్ మంత్రాన్ని పలికేస్తున్నారు. ఆచార్య, రాధేశ్యామ్ ఇచ్చిన షాక్ తో కాస్ట్లీ క్లాస్ ప్రాజెక్టులకు సైన్ చేయాలంటే వణికిపోతున్నారు.

Telugu Movies: మాస్ మంత్రాన్ని పలికేస్తున్న స్టార్ హీరోలు!

Telugu Movies: కేజీఎఫ్, పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ తో ఇప్పుడు హీరోలందరూ మాస్ మంత్రాన్ని పలికేస్తున్నారు. ఆచార్య, రాధేశ్యామ్ ఇచ్చిన షాక్ తో కాస్ట్లీ క్లాస్ ప్రాజెక్టులకు సైన్ చేయాలంటే వణికిపోతున్నారు. మాస్ మూవ్ మెంట్స్ తో A టు C ఆడియెన్స్ ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు.

Telugu Movies: భారీ సినిమాల మధ్యలో ముద్దుగా వస్తున్న రొమాంటిక్ మూవీస్!

రాధేశ్యామ్ తో పొగొట్టుకున్న ఇమేజ్ ను సలార్ తో వడ్డీతో సహా రాబట్టుకోవాలనేది ప్రభాస్ ప్లాన్. కేజీఎఫ్ లాంటి బ్లాస్టింగ్ ఫ్రాంచైజ్ చూపించిన ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా నంబర్ 1 కటౌట్ ప్రభాస్ నటిస్తున్నారన్నప్పుడే అంచనాలు పెరిగాయి. ఇప్పుడు కేజీఎఫ్ 2 ఇంత బ్లాక్ బస్టర్ అయ్యాక ఆ అంచనాల రెట్టింపు అయ్యాయి. యశ్ నే బూస్టింగ్ ఎలివేషన్స్ లో మాస్టర్ గా చూపించిన ప్రశాంత్ నీల్… ప్రభాస్ కు డబుల్ డోస్ ఇస్తారని ఆశలు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. అదే 100 పర్సెంట్ నిజమైతే సెంటర్ ఏదైనా మాస్ దేవుడిగా రెబల్ స్టార్ మారడం ఖాయం.

Telugu Movies: అన్ని ఎలిమెంట్స్ కాదు.. కొత్తగా కావాలంటున్న ప్రేక్షకులు!

లైగర్ కూడా మాస్ టచ్ ఇవ్వబోతుంది. లోకల్ ఛాయ్ వాలా.. ప్రపంచం మెచ్చే బాక్సర్ గా ఎలా ఎదిగాడనేది లైగర్ కథ. అసలే మాస్ మ్యానరిజమ్స్ తో మజాక్ చేసే పూరీ జగన్నాథ్.. ఆపై అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ. వీళ్లిద్దరూ కలిస్తే ముంబై మాత్రమే కాదు.. హోల్ ఇండియా ఆడియెన్స్ ని లైగర్ షేక్ చేయడం పక్కా అని తేల్చేస్తున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ తర్వాత మళ్లీ త్వరలో ఇంతటి మాస్ జాతర లైగర్ తోనే చూస్తామనే అంచనాలు కొందరిలో ఉన్నాయి.

Telugu Movies: ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్!

క్రాక్ లాంటి మాస్ క్రాకర్ ను రవితేజ అకౌంట్ లో వేసిన గోపీచంద్ మలినేని ఓ వైపు.. అఖండతో సాలిడ్ హిట్ కొట్టిన బాలయ్య మరోవైపు. ఇద్దరూ కలిసి ఇప్పుడు మరో మాస్ రాకెట్ నే తయారుచేస్తున్నారు. కొరటాల శివతో తారక్ చేయబోయేది ఫుల్ లెంత్ మాస్ మూవీనే. ఆల్రెడీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మాస్ ఆడియెన్స్ లైక్ చేసిన సినిమానే. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తారక్ ను ప్రెజెంట్ చేయడం కోసం కొరటాల బిగ్ బడ్జెట్ తో బిగ్ స్కెచ్ వేసారనే టాక్ ఉంది.

Telugu Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. ఏ పెద్ద సినిమా అయినా వారం రోజులే!

సాఫ్ట్ రూట్ మార్చి మాస్ ట్రాక్ ఎక్కాడు నాని. పుష్ప, కేజీఎఫ్ ను మిక్స్ చేసిన రా అండ్ టఫ్ లుక్ లో దసరా సినిమా చేస్తున్నాడు. కేజీఎఫ్ లాగా డార్క్ బ్యాక్ గ్రౌండ్.. పుష్పరాజ్ లా జుట్టు, గడ్డం, లుంగీ.. నాని మాస్ అవతార్ లో కొత్తగా ట్రై చేస్తున్నాడు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఈ మాస్ సీజన్ లో మెరుపులా దసరా దూసుకుపోతుందనే అంచనాలు నానికున్నాయి. సాని కాయిదంలో రగ్డ్ లుక్ చూపించిన కీర్తి సురేశ్.. దసరాలోనూ డీగ్లామరస్ గానే కనిపించబోతుంది. మాస్ యాంగిల్ చూపించాలనే ఆలోచన ఇప్పుడు టైర్ 2 హీరోలను కూడా వెంటాడుతోంది. నితిన్ మాచర్ల నియోజక వర్గంతో తనలోని మాస్ హీరోని బయటికి తెస్తా అంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి పక్కా మాస్ మూవీ తర్వాత.. ది వారియర్ తో మరోసారి రామ్ విశ్వరూపం చూపిస్తాడనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

×