Tollywood : నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య ముదురుతున్న వివాదం

టాలీవుడ్‌లో థియేటర్ ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. మొన్న తమపై ఎగ్జిబిటర్స్ చేసిన వ్యాఖ్యలకు నిర్మాతలు కౌంటర్ ఇచ్చారు.

Tollywood : నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య ముదురుతున్న వివాదం

Tollywood

Tollywood : టాలీవుడ్‌లో థియేటర్ ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. మొన్న తమపై ఎగ్జిబిటర్స్ చేసిన వ్యాఖ్యలకు నిర్మాతలు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఓటీటీ వర్సెస్ థియేటర్స్ గా వివాదం కాస్తా.. ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతలుగా మారింది.

ఓ వైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ లో మాటలయుద్ధం.. మరోవైపు సినిమాల విడుదలపై థియేటర్స్ అసోసియేషన్‌, నిర్మాతల మధ్య వివాదం.. టాలీవుడ్‌లో అగ్గి రగులుతోంది.. టక్‌ జగదీష్‌ సినిమాను సెప్టెంబర్‌ 10న ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ప్రారంభమైన రగడ… రోజురోజుకు ముదురుతోంది.

టక్‌ జగదీశ్‌ సినిమాను ఓటీటీలోనే విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించడంతో… మూవీ థియేటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు మొన్న నిర్మాతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలే కరోనాతో తీవ్ర నష్టాల్లో ఉంటే… నిర్మాతలు ఓటీటీని సంప్రదించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పండుగల సమయంలో ఓటీటీలో సినిమాల విడుదలను ఆపేయ్యాలని కోరారు. దీనికి నిర్మాతలు దిల్‌రాజ్, ఠాగూర్ మధు సహా పలువురు అగ్ర నిర్మాతలతో కూడి తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ కౌంటర్ ఇచ్చింది. థియేటర్స్‌ అసోసియేషన్‌, ఎగ్జిబిటర్స్‌ తీరుపై ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.
.
సినిమా థియేటర్స్ అసోసియేషన్ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని టాలీవుడ్ నిర్మాతలు అభిప్రాయపడ్డారు. సినిమాపై పూర్తి హక్కు, అధికారం నిర్మాతలకే ఉంటుందని, తమ సినిమా ఎక్కడ, ఎప్పుడు విడుదల చేసుకోవాలో తమ ఇష్టమని వెల్లడించింది. ఎగ్జిబిటర్లు… డిమాండ్ ఉన్న పెద్ద సినిమాలపైనే దృష్టి పెడుతున్నారని, చిన్న సినిమాలను విస్మరిస్తున్నారని నిర్మాతల గిల్డ్ ఆరోపించింది.

నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లందరూ కలిసి ఉంటేనే సినీ పరిశ్రమ మనుగడ సాధ్యమవుతుందని సూచించిన నిర్మాతల గిల్డ్… కలిసి కట్టుగా పనిచేసి తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధికి పాటుపడదామని ప్రకటనలో కోరింది.