Vaishnav Tej: రంగరంగ వైభవంగా ట్రైలర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది.

Vaishnav Tej: రంగరంగ వైభవంగా ట్రైలర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Vaishnav Tej Ranga Ranga Vaibhavanga Trailer Locks Date

Vaishnav Tej: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ హీరో నటించిన రెండో సినిమా ‘కొండపొలం’ వైవిధ్యమైన కథతో తెరకెక్కినా, ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది.

Ranga Ranga Vaibhavanga: కొత్తగా లేదేంటి సాంగ్.. కేతికతో వైష్ణవ్ రొమాన్స్!

కాగా, వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు గిరీశాయ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది.

Vaishnav Tej : చెప్పిన మాట వింటే భలే ముద్దొస్తావు.. రంగరంగ వైభవంగా టీజర్ రిలీజ్..

ఆగస్టు 23న సాయంత్రం 5 గంటలకు రంగరంగ వైభవంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని వైష్ణవ్ తేజ్ చూస్తున్నాడు. భారీ తారాగణంతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.