Das Ka Dhamki Pre Release Event : దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్.. నాటు నాటు ఆస్కార్ గెలిచాక మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్..
హైదరాబాద్ శిల్పకళావేదికలో దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.

Das Ka Dhamki Pre Release Event : యువ హీరో విశ్వక్సేన్ దాస్ కా ధమ్కీ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 22న పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తుండటంతో, ఆస్కార్ గెలిచాక మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్ వస్తున్నాడని ఈవెంట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు భారీగా ఈవెంట్ కి తరలి వచ్చారు.
LIVE NEWS & UPDATES
-
ఎన్టీఆర్
ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ rrr ప్రపంచం అంతా నిలబడింది అంటే, ఆస్కార్ దక్కించుకుంది అంటే రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో వారితో పాటు తెలుగు చలన చిత్రసీమ, భారతదేశపు ప్రేక్షకులు కూడా అంతే కారణం. కీరవాణి, చంద్రబోస్ గారిని ఆ స్టేజి మీద చూస్తుంటే భారతీయులు, ఇద్దరు తెలుగు వాళ్ళు కనపడ్డారు. నేను లైవ్ లో చూసాను, ఆ మూమెంట్ ఎప్పటికి గుర్తుండిపోద్ది. RRR సినిమాతో తెలుగు సినిమాలు మరింత ముందుకు వెళ్ళాలి. విశ్వక్ మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. విశ్వక్ నా కంటే ఎనర్జీ ఎక్కువ. నా బాధ్యత ఇది. నాకు బాగా ఇష్టమైన సినిమాలు చాలా తక్కువ. అందులో ఈ నగరానికి ఏమైంది సినిమా ఒకటి. అందులో విశ్వక్ ని చూస్తూ ఉండిపోవచ్చు. ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు. కొత్తలోనే అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఆ తర్వాత ఫలక్ నామా దాస్ చూశాను డైరెక్టర్ గా కూడా చేశాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకి రావాలి కానీ రాలేకపోయాను. ఆ సినిమాలో అతని యాక్టింగ్ చూసి షాక్ అయ్యాను. అతని యాటిట్యూడ్ కి దూరంగా ఆ క్యారెక్టర్ చేశాడు. నాకు అలా మారడానికి చాలా టైం పట్టింది. నటుడిగా నాకు తెలుసు విశ్వక్ కి ఇంత తక్కువ ఏజ్ లోనే బాగా చేస్తున్నాడు. తనకు తాను సక్సెస్ అవ్వడానికి బయలుదేరాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. విశ్వక్ దర్శకత్వం ఆపేయాలి. చాలా మంది దర్శకులు ఉన్నారు. నువ్వు నటుడిగా చాలా సినిమాలు చేయాలి. మనలాంటి నటులు అందరూ కలిసి తెలుగు పరిశ్రమని పడనివ్వకూడదు. నేను ఉన్నదంతా పెట్టేశాను అని అడిగితే నాకు బాధ వేసింది. కానీ అది సినిమా మీద ఉన్న పిచ్చి అది. ఇలాంటి వాళ్ళే సినిమాలని ముందుకు తీసుకెళ్తారు. అందుకే ఎంకరేజ్ చేస్తున్నాను. ఉగాదికి విశ్వక్ కి కూడా అయి సినిమా హిట్ కొట్టి పండగ చేసుకోవాలి. అభిమానులందరికి రుణపడి ఉంటాను అని అన్నారు.
-
విశ్వక్ సేన్
ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడిదాకా వచ్చాడు ఎన్టీఆర్ అన్న. అభిమానుల కోసం వచ్చారు. ఎన్టీఆర్ అన్న ఇంటికి పిలిచి తమ్ముడికి భోజనం పెట్టినట్టు పెట్టి కారు దాక వచ్చి ఎక్కించాడు. అప్పుడు అన్న ధమ్కీ కోసం రావాలి అంటే సరే మాట ఇచ్చాను అన్నారు. తారకరత్న గారు చనిపోయిన సమయంలో కూడా ఆ కార్యక్రమాలు అయ్యాక నాకు ఫోన్ చేయించి ఈవెంట్ ఎప్పుడో డేట్ కనుక్కోమన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మాట గుర్తుపెట్టుకున్నాడు అన్న. ఇండియా మొత్తం లో బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఎన్టీఆర్ అన్నే. ఎన్టీఆర్ అన్నని ఇప్పటిదాకా చూసింది టీజర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడే మొదలైపోయింది. ఈ సినిమాకి మొత్తం డబ్బులు పెట్టేశాను. నేను పడిపోతే బాగుండు అని చాలా మంది కోరుకున్నారు. నేను ఏడ్వాలనుకున్నారు. కానీ పై నుంచి దేవుడు చూస్తున్నాడు. అందుకే ఇవాళ ఎన్టీఆర్ అన్నని పంపించాడు ఇక్కడికి అని అన్నాడు.
-
ఎన్టీఆర్, విశ్వక్ ఇప్పుడే వేదికపైకి వచ్చారు.
-
నివేతా పేతురాజ్
నివేతా పేతురాజ్ మాట్లాడుతూ..ధమ్కీ కోసం విశ్వక్ బాగా కష్టపడ్డాడు అని చెప్తూ, ఎన్టీఆర్ ఆస్కార్ వేదిక వరకు వెళ్లినందుకు దేశాన్ని గర్వపడేలా చేశారు అంటూ పొగిడేసింది.
-
కరాటే రాజు
దాస్ కా ధమ్కీ సినిమా నిర్మాత, విశ్వక్ తండ్రి కరాటే రాజు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఎన్టీఆర్ తమ సినిమాకు సపోర్ట్ ఇచ్చారన్నారు.
-
రైటర్ ప్రసన్న కుమార్
రైటర్ ప్రసన్న కుమార్ దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై మాట్లాడారు. ఎన్టీఆర్ తో కలిసి రెండు యాడ్స్ చేశానని చెప్పాడు.
-
ఎన్టీఆర్
ఎన్టీఆర్ గ్రాండ్ గా దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేశాడు.
-
హైపర్ ఆది
చరణ్, ఎన్టీఆర్ విడివిడిగా ఫ్యాన్స్ మీసం తిప్పే సినిమాలు తీశారు. కానీ ఇద్దరూ కలిసి RRR సినిమాతో దేశం మీసం తిప్పే సినిమా తీశారని అన్నారు హైపర్ ఆది.
-
హైపర్ ఆది
హైపర్ ఆది మాట్లాడుతూ రైటర్ ప్రసన్న కుమార్ గురించి బాగా మాట్లాడాడు. విశ్వక్ సేన్, ఎన్టీఆర్ ల గురించి కూడా పొగిడేశాడు.
-
హను రాఘవపూడి
దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ ఎన్టీఆర్, విశ్వక్ సేన్ లను పొగిడేశారు.
-
సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ వేదికపై మాట్లాడారు.
-
సింగర్ మంగ్లీ
సింగర్ మంగ్లీ వేదికపై మాట్లాడుతూ ఈ సినిమాలో డాలర్ పిలగా.. అనే ఓ పాత పాడాను అని తెలిపి పాటలోని కొన్ని లైన్స్ పాడి వినిపించింది.
-
లిరిక్ రైటర్ పూర్ణాచారి, కాసర్ల శ్యామ్
లిరిక్ రైటర్ పూర్ణాచారి, కాసర్ల శ్యామ్ వేదికపై మాట్లాడారు. కాసర్ల శ్యామ్ మూడు పాటలు రాయగా, కాసర్ల శ్యామ్ రెండు పాటలు రాశారు ఈ సినిమాలో
-
విశ్వక్సేన్
విశ్వక్సేన్ ఇప్పుడే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
-
ఎన్టీఆర్, విశ్వక్సేన్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
-
విశ్వక్సేన్, ఎన్టీఆర్ పాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తున్నారు పలువురు డ్యాన్సర్లు..
-
దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్
దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది.