కొత్త రూల్స్ ని స్వాగతించిన డిజిటల్ మీడియా

ఇటీవల కేంద్రప్రభుత్వం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మరియు ఆన్ లైన్ మీడియా పోర్టల్స్ కు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్

కొత్త రూల్స్ ని స్వాగతించిన డిజిటల్ మీడియా

Prakash Javadekar ఇటీవల కేంద్రప్రభుత్వం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మరియు ఆన్ లైన్ మీడియా పోర్టల్స్ కు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్.. ​ఓటీటీ, డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్లతో సమావేశమై కొత్త గైడ్ లైన్స్ పై వారితో చర్చించారు.

వర్చువల్​​ విధానంలో సాగిన ఈ సమావేశానికి దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు అన్నీ హాజరయ్యాయి. దయనిక్ జాగ్రన్,ఇండియా టుడే,దైనిక్ భాస్కర్,హిందుస్తాన్ టైమ్స్,టైమ్స్ ఆఫ్ ఇండియా,ఏబీపీ,ఇండియన్ ఎక్స్ ప్రెస్,ఈనాడు,లోక్ మత్ సంస్థల ప్రతినిధులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు.

కొత్త నిబంధనలపై సమాచార మంత్రిత్వ శాఖ చర్చించిందని.. వీటిని సావధానంగా విన్న వారు నిబంధనలను స్వాగతించినట్లు ప్రకాశ్​ జావదేకర్​ చెప్పారు. మరికొన్ని సూచనలు వారు చేసినట్లు పేర్కొన్నారు. వారు చేసిన సూచనలను పరిశీలిస్తున్నట్లు జావదేకర్ తెలిపారు. ప్రజల నుంచి వస్తోన్న వినతులను పరిష్కరించడానికి కొత్త నిబంధనలను తీసుకువచ్చాం. ఫిర్యాదుల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశాం. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ కూడా కొంత ప్రాథమిక సమాచారాన్ని మంత్రిత్వ శాఖకు సరళమైన రూపంలో అందించాల్సిన అవసరం ఉంది. ఇలా ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను బహిరంగంగా వివరించాల్సి ఉంటుందని జావదేకర్ తెలిపారు.