Uttar Pradesh Boy: ములాయం సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇంటి నుంచి పారిపోయిన బాలుడు.. చివరకు ఏం జరిగిందంటే

ఇటీవల మరణించిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పదేళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని రైల్వే పోలీసులు గమనించారు. తండ్రికి సమాచారం అందించారు.

Uttar Pradesh Boy: ములాయం సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇంటి నుంచి పారిపోయిన బాలుడు.. చివరకు ఏం జరిగిందంటే

Uttar Pradesh Boy: ఇటీవల మరణించిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పదేళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. ములాయం సింగ్ యాదవ్ గత సోమవారం మరణించిన సంగతి తెలిసిందే.

Boora Narsaiah Goud: టీఆర్ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం?

ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన సైఫైలో జరిగాయి. అయితే, ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహారాజాగంజ్, లక్ష్మీపూర్‌కు చెందిన శ్యామ్‌లాల్ యాదవ్ అనే పదేళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. ఒంటరిగా రైలెక్కి గోరఖ్‌పూర్ చేరుకున్నాడు. అయితే, అక్కడ ఒంటరిగా కనిపించిన బాలుడిని కాన్పూర్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. దీనికి శ్యామ్‌లాల్ తాను ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే, పోలీసులు బాలుడి తండ్రికి సమాచారం అందించారు. బాలుడు తమ దగ్గర క్షేమంగా ఉన్నాడని, తమ దగ్గరికి వచ్చి బాలుడిని తీసుకెళ్లాలని సూచించారు.

Class 9 Girl: పరీక్షలో కాపీ కొడుతుందని అనుమానం.. బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కాగా, బాలుడు.. తాను సమాజ్ వాదీ పార్టీకి చెందిన సానుభూతి పరుడిని అని, తాను పార్టీకి ‘స్టార్ క్యాంపెయినర్’ అని చెప్పుకుంటున్నాడు. ఇక, ఈ విషయం తెలిసిన సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ బాలుడిని సైఫై తీసుకురావాలని, అక్కడ ములాయం సింగ్ యాదవ్‌కు బాలుడు నివాళులు అర్పిస్తాడని చెప్పాడు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలని పార్టీ నేతలను ఆదేశించారు.