Car-Dragging Death: ఢిల్లీలో మహిళను ఈడ్చుకెళ్లిన కారు ప్రమాదంపై హోంశాఖ చర్యలు.. 11 మంది పోలీసులు సస్పెండ్

20 ఏళ్ల అంజలి సింగ్ కొత్త సంవత్సరం పార్టీ తర్వాత తన స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమెను కారు ఢీకొట్టింది. ఆమె కాలు కారు ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. అయితే ఆమెను సుల్తాన్‌పురి నుండి ఉత్తర ఢిల్లీలోని కంఝవాలా వరకు సుమారు 13 కి.మీల దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది.

Car-Dragging Death: ఢిల్లీలో మహిళను ఈడ్చుకెళ్లిన కారు ప్రమాదంపై హోంశాఖ చర్యలు.. 11 మంది పోలీసులు సస్పెండ్

11 Delhi Cops Suspended For Negligence After Woman's Car-Dragging Death

Car-Dragging Death: దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళను కారు ఈడ్చుకెళ్లి హతమార్చిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 11 మంది పోలీసులు సస్పెండ్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మూడు పీసీఆర్ వ్యాన్లు, రెండు పికెట్లలో ఉన్న సిబ్బంది అందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా వెల్లడించారు. వీరంతా ఆ కారు సంఘటన జరిగిన ఔటర్ ఢిల్లీలోని కంఝువాలా ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న రోహిణీ ప్రాంత పోలీసులు. కాగా, సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. వీరిలో ఆరుగురికి పీసీఆర్ డ్యూటీ ఉండగా, ఐదుగురు పికెట్లు నిర్వహిస్తున్నారు.

Shankar Mishra: విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో కొత్త కోణం

ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమీషనర్ షాలినీ సింగ్ దర్యాప్తులో పోలీసు సిబ్బందిని దోషులుగా నిర్ధారించారు. అనంతరమే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసు బాసుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఎఫ్ఐఆర్)లో హత్య ఆరోపణలను చేర్చాలని మంత్రిత్వ శాఖ కోరింది. నూతన సంవత్సరం తొలిరోజు అర్థరాత్రి జరిగిన ఈ దారుణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో గుజరాత్ నుండి ఫోరెన్సిక్ నిపుణులను సంఘటన స్థలం నుండి సాక్ష్యాలు, నమూనాలను సేకరించి విచారణ చేశారు.

Kiren Rijiju: బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేతకు భంగపాటు.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

డీసీపీ (అవుటర్) హరేంద్ర కే.సింగ్ అభ్యర్థన మేరకు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీకి చెందిన ఐదుగురు ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నదని ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన వెంటనే ఐదుగురిని, నేరానికి సహకరించినందుకు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), క్రిషన్ (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్‌లను జనవరి 1వ తేదీన పోలీసులు అరెస్టు చేయగా, నిందితులను రక్షించినందుకు మరో ఇద్దరు వ్యక్తులు అశుతోష్, అంకుష్ ఖన్నాలను ఆ మరుసటి రోజు అరెస్టు చేశారు.

Anand Mahindra ‘Natu Natu Song’ : ఆనంద్ మహీంద్రా ‘నాటు నాటు’సాంగ్ డ్యాన్స్ మామూలుగా లేదుగా..ఏం క్రియేటివీ.!!

కిటికీలు కిందకి దిగి ఉండడంతో పాటు లోపల పెద్దగా సంగీతం వినిపిస్తున్నందున, తమ కారు కింద మహిళ ఇరుక్కుపోయిందని తాము వినలేదని నిందితులు మొదట చెప్పారు. అయితే, మహిళ కారు కింద ఇరుక్కుపోయిందని ముందుగానే తెలిసిందని, ఈ భయంతో కారు ఆపకుండా తోలినట్లు తర్వాతి విచారణలో నిందితులు అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Rapido Bike Taxi: ర్యాపిడోకు షాకిచ్చిన బాంబే హైకోర్టు.. సర్వీసులన్నీ వెంటనే నిలిపివేతకు ఆదేశాలు

20 ఏళ్ల అంజలి సింగ్ కొత్త సంవత్సరం పార్టీ తర్వాత తన స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమెను కారు ఢీకొట్టింది. ఆమె కాలు కారు ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. అయితే ఆమెను సుల్తాన్‌పురి నుండి ఉత్తర ఢిల్లీలోని కంఝవాలా వరకు సుమారు 13 కి.మీల దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితుడు మరో వైపు పడిపోయి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నిందితులు తాగి ఉన్నారని ఆరోపిస్తూ హత్యానేరం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంతో మరణానికి కారణం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు.