Oxygen Plants : కొత్తగా 1500 ఆక్సిజన్ ఫ్లాంట్లు

కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

Oxygen Plants : కొత్తగా 1500 ఆక్సిజన్ ఫ్లాంట్లు

Modi (1)

Oxygen Plants కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూనే మరోవైపు కరోనా మెడిసిన్స్,ఆక్సిజన్ కొకత ఏర్పడకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తుంది. మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో ఏప్రిల్-మేలో హాస్పిటల్స్ లో తీవ్రమైన ఆక్సిజన్ కొరతతో వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు, సరఫరాను పెంచేందుకు కేంద్రం దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా 1500 ​ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని శుక్రవారం కేంద్రం నిర్ణయించింది.

ఆక్సిజన్‌ సరఫరా సహా పలు అంశాలపై ఇవాళ ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. వర్చువల్ గా జరిగిన ఈ మీటింగ్ లో ప్రధాని ముఖ్య కార్యదర్శి,కేబినెట్ సెక్రటరీ,హెల్త్ సెక్రటరీ,గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సెక్రటరీ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. పీఎం కేర్స్‌ నిధుల ద్వారా కొత్తగా 1500 ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆక్సిజన్ ఫ్లాంట్లు అందుబాటులోకి వస్తే దేశంలో 4 లక్షలకుపైగా ఆక్సిజన్‌ పడకలకు ప్రాణవాయువు సరఫరా చేసేందుకు వీలవుతుందని అధికారులు మోదీకి వివరించారు. దీనికి మోదీ స్పందిస్తూ.. వీలైనంత త్వరగా ఈ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వాటి నిర్వహణపై ఆసుపత్రుల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరును తెలుసుకునేందుకు అత్యాధునిక ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని మోదీ పేర్కొన్నారు. మరోవైపు, కోవిడ్‌-19పై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా మౌలిక వైద్య సదుపాయాల పెంపు కోసం రూ.23,123 కోట్ల ప్యాకేజీకి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే.

ఇక,కోవిడ్ ఆంక్షలను రాష్ట్రాలు క్రమంగా సడలిస్తున్న వేళ ప్రజలు మళ్లీ నిబంధనలు పట్టించుకోకుండా గుమికూడుతున్నారు. పెద్ద సంఖ్యలో పర్యాటక ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ఉదృతి తగ్గినా..దానికి ప్రమాదం ఇంకా ఉందని,కోవిడ్ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించరాదని మోదీ తెలిపారు.