గౌహతిలో మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు

  • Published By: venkaiahnaidu ,Published On : June 26, 2020 / 09:04 AM IST
గౌహతిలో మరో రెండు వారాలు లాక్  డౌన్ పొడిగింపు

కరోనా విజృంభనతో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత లాక్ డౌన్ ను రాజధాని గౌహతిలో ఆదివారం అర్థరాత్రి నుంచి మరో రెండు వారాల పొడిగిస్తున్నట్లు అసోం ప్రభుత్వం శుక్రవారం(జూన్-26,2020)ప్రకటించింది.

అదేవిధంగా రెండు వారాలపాటు   రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు తెలిపింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శుక్రవారం నాటికి అసోంలో కరోనా కేసుల సంఖ్య 6,321కి చేరింది. కరోనా వల్ల ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది మరణించారు. నార్త్ ఈస్ట్ లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రంగా అసోం నిలిచింది 

కాగా వలస కార్మికులు తిరిగి వచ్చిన నాటి నుంచి అసోంలో కరోనా కేసుల తీవ్రత మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా గౌహతి నగరంలో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండటంతో సోమవారం నుంచి రెండు వారాలపాటు పూర్తిగా లాక్‌డౌన్‌ను విధించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి  హిమంత బిస్వా శర్మ శుక్రవారం తెలిపారు. ఆదివారం లోపు ప్రజలు షాపింగ్ పూర్తీ చేసుకోవాలని అయన తెలిపారు. 

కేవలం మందుల షాపులను మాత్రమే అనుమతిస్తామన్నారు బిస్వా శర్మ. అర్బన్‌ ప్రాంతాల్లో శనివారం, ఆదివారం రోజుల్లో లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఇది కొనసాగుతుందని అయన తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా, కరోనా కేసుల సంఖ్య 4.9 లక్షలకు చేరింది. గడిచిన 24గంటల్లో 17వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.   

Read: కరోనాకి మందు కనిపెట్టటానికి బైక్ దొంగతనం…!