ఏరులై పారనున్న డబ్బు : ప్రపంచంలోనే ఖరీదైనవిగా 2019 ఎన్నికలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 22, 2019 / 03:22 PM IST
ఏరులై పారనున్న డబ్బు :  ప్రపంచంలోనే ఖరీదైనవిగా 2019 ఎన్నికలు

2019 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు తెలిపారు. దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని త్వరలోనే  ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ప్రకటించనుంది.
2016లో జరిగిన అమెరికా అధ్యక్ష, ప్రజాప్రతినిధుల ఎన్నికల ఖర్చు మొత్తం కలిపి 650 కోట్లు అయిందని, 2014 లోక్ సభ ఎన్నికల ఖర్చు 500 కోట్లు అయిందని,2019 ఎన్నికల్లో ఆ ఖర్చుని భారత్ చాలా సులభంగా  అధిగమిస్తుందని, ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలుగా ఈసారి జరుగబోయే సార్వత్రిక ఎన్నికలు నిలువనున్నట్లు కార్నిగి ఎండోవ్ మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ థింక్ ట్యాంక్ దక్షిణాసియా ప్రోగ్రామ్ డైరక్టర్ మిలాన్ వైష్నవ్ తెలిపారు.

చాలా ఏళ్లుగా భారతీయ ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా ఎన్నికల్లో పార్టీ ఫండింగ్ కు సంబంధించి వైష్నవ్ విశ్లేషణలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీలు బాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశముందని ఆయన తెలిపారు. ప్రపంచంలోని  ఏ ప్రజాస్వామ్య దేశంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టని విధంగా భారతీయ పార్టీల నేతలు రానున్న ఎన్నికల్లో ఖర్చు చేయనున్నారని, డబ్బుల ప్రవాహం ఏరులై పారనుందని తెలిపారు. రాజకీయ సహకారానికి  సంబంధించి భారత్ లో సున్నా శాతం పారదర్శకత ఉంటుందని అన్నారు. ఓ రాజకీయ నాయకుడికి గానీ, పార్టీకి గాని డబ్బులు ఎవరు డొనేట్ చేశారు,, ఎక్కడి నుంచి ఆ రాజకీయ నేతకు ఫండింగ్ వచ్చిందనేది గుర్తించడం భారత్ లో అసాధ్యం అని తెలిపారు. అయితే ఎన్నికల్లో ఫండింగ్ కు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు కూడా అంత పారదర్శంగా అమలు జరిగే అవకాశం లేదని తెలిపారు.