Corona Vaccination: దేశంలో 26.55 కోట్ల డోసుల కరోనా టీకాలు అందజేత

ఇక ఇప్పటి వరకు దేశంలో 26,55,19,251 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక 24 గంటల్లో 34.6 లక్షల వ్యాక్సిన్లను ఆయా రాష్ట్రాలకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది

Corona Vaccination: దేశంలో 26.55 కోట్ల డోసుల కరోనా టీకాలు అందజేత

Corona Vaccination

Corona Vaccination: దేశంలో గత ఐదు నెలలుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదట్లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉండేది, వ్యాక్సిన్ తయారి కంపెనీలు ఉత్పత్తి పెంచడంతో కొంతమేర కొరత తీరింది. ఇక ఇప్పటి వరకు దేశంలో 26,55,19,251 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక 24 గంటల్లో 34.6 లక్షల వ్యాక్సిన్లను ఆయా రాష్ట్రాలకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

 

టీకా తీసుకున్న వారు.

ఇక హెల్త్ వర్కర్స్ కేటగిరిలో మొదటి డోస్ తీసుకున్నవారి సంఖ్య 1,00,88,081 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్న వారు 70,17,838 మంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కేటగిరిలో మొదటి డోస్ తీసుకున్న వారు 1,69,56,515 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్నవారు 89,36,711 మంది ఉన్నారు. ఇక 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వారిలో మొదటి డోస్ తీసుకున్న వారు 4,73,43,608 మంది కాగా రెండవ డోస్ తీసుకున్న వారు 9,69,085 మంది ఉన్నారు.

 

45 నుంచి 60 మధ్య వయసు వారిలో మొదటి డోస్ తీసుకున్న వారు 7,79,22,224 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్నవారు 1,22,96,349 మంది. ఇక 60 ఏళ్ళు పైబడిన వారిలో మొదటి డోస్ తీసుకున్న వారు 6,35,37,652 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్న వారు 2,04,51,188 మంది ఉన్నారు. ఇక జూన్ 17 వరకు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 26,55,19,251 గా ఉంది.