Jammu And Kashmir : విరిగిపడ్డ మంచు పెళ్లలు..కశ్మీర్ లోయలో పడి ముగ్గురు సైనికుల మృతి

కశ్మీర్ లో మంచు పెళ్లలు విరిగిపడి ముగ్గురు సైనికులు లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికుల మృతి చెందారు.

Jammu And Kashmir : విరిగిపడ్డ మంచు పెళ్లలు..కశ్మీర్ లోయలో పడి ముగ్గురు సైనికుల మృతి

Army

Jammu And Kashmir : జమ్మూ కశ్మీర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విరిగిపడ్డ మంచు పెళ్లలు ముగ్గురు భారత సైనికుల్ని పొట్టనపెట్టుకున్నాయి. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలోని మచల్ సెక్టార్ వద్ద రెగ్యులర్ గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. గడ్డ కట్టే మంచులో దేశం కోసం గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు చనిపోయారు. వీరు ముగ్గురు డోగ్రా రెజిమెంట్లోని 14వ బెటాలియన్ కు చెందినవారే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గత కొద్ది రోజులుగా మంచు కురుస్తునే ఉంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దేశం కోసం గస్తీ కాస్తున్న భారత సైనికులు లోయలో పడి ప్రాణాలు కోల్పోవటం యావత్ భారతాన్ని కలచివేస్తోంది.

వీరిలో ఇద్దరు సైనికులతో పాటు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. మంగళవారం (జనవరి 10,2023) సాయంత్రం 6.30 గంటల సయంలో ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో ముగ్గురు పట్టుతప్పి లోయలో పడిపోయారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికుల వివరాలు తెలియాల్సి ఉంది.