Covid-19: ఇప్పటికీ సగం మంది మాస్క్ వేసుకోవడం లేదు – హెల్త్ మినిస్ట్రీ

యావత్ దేశమంతా కరోనా భయంతో అల్లల్లాడిపోతుంటే.. ఇప్పటికీ సగం మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారట. స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది.

Covid-19: ఇప్పటికీ సగం మంది మాస్క్ వేసుకోవడం లేదు – హెల్త్ మినిస్ట్రీ

Mask Usage

Covid-19: యావత్ దేశమంతా కరోనా భయంతో అల్లల్లాడిపోతుంటే.. ఇప్పటికీ సగం మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారట. స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. సగం మంది అస్సలు మాస్కు వేసుకోవడం లేదని చెప్పి… మాస్కు వేసుకున్న వారిలో 64శాతం మంది ముక్కును కవర్ చేసుకోవడం లేదని చెప్పింది.

హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ లా అగర్వాల్ మాట్లాడుతూ.. ఎనిమిది రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 9రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష వరకూ యాక్టివ్ కేసులు ఉండగా, 19రాష్ట్రాల్లో 50వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కర్ణాటక, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఇంకా 25శాతం తీవ్రత కనిపిస్తూనే ఉంది. ఫిబ్రవరి నెల మధ్య నుంచి ఇండియాలో 2.3 రెట్లు కరోనా తీవ్రత పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. 10వారాలుగా కొవిడ్ పాజిటివిటీ పెరుగుతుండగా రెండు వారాలుగా కాస్త తగ్గుతున్నట్లుగా కనిపించిందని చెప్పింది.

ఏప్రిల్ 29 నుంచి మే5వరకూ పాజిటివిటీ 210గా నమోదైన కేసులలో మే13 నుంచి 19వరకూ 303అయ్యాయి. ఏడు రాష్ట్రాల్లో పాజిటివిటీ 25శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ అనేది 15శాతం కంటే ఎక్కువగానే ఉందని వెల్లడించింది.

సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ల వాడకం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకుని ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చని చెప్పింది.