Corona deaths : 24 గంటల్లో 6,148 మరణాలు

కరోనా తగ్గుతోందని అనుకుంటున్న సమయంలో మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోందా? అనే భయాందోళనలకు కలుగుతున్నాయి గత 24 గంటల్లో నమోదు అయిన మరణాల సంఖ్య చూస్తుంటే. గడిచిన 24 గంటల్లో భారత్ లో 6,148 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Corona deaths : 24 గంటల్లో 6,148 మరణాలు

Corona Deaths

Corona deaths in india : కరోనా తగ్గుతోందని అనుకుంటున్న సమయంలో మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోందా? అనే భయాందోళనలకు కలుగుతున్నాయి గత 24 గంటల్లో నమోదు అయిన మరణాల సంఖ్య చూస్తుంటే. గడిచిన 24 గంటల్లో భారత్ లో 6,148 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా రోజు రోజుకు కంట్రోల్ అవుతుందనుకుంటున్న సమయంలో మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈక్రమంలో 6వేలకు పైగా మరణాలు సంభవించగా దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 11,67,952 కేసులు నమోదుకాగా..కొత్తగా 94,052 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కరోనాను ఖతం చేయటానికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 32,90,58,360 వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. ఈక్రమంలో దేశంలో మొదటిసారిగా కరోనా మరణాల సంఖ్య 6 వేలు దాటి రికార్డు స్థాయికి చేరింది.ప్రస్తుతం దేశంలో 11,67,952 యక్టీవ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే.. 2,76,55,493 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో పాజిటివిటి రేటు 4.60 శాతంగా ఉంది. 17 రోజులుగా 10 శాతానికి దిగువన పాజిటివిటి రేటు నమోదు కాగా..28 రోజులుగా కొత్త కేసులకన్నా అధికంగా నమోదవుతున్న రికవరీ కేసులు ఉన్నాయి.

దేశంలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల్లో లక్షకు పైగా యక్టీవ్ కేసులు ఉండగా..కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, లో అధికంగా యక్టీవ్ కేసులున్నాయి. యక్టీవ్ కేసులు..పెరుగుతున్న రికవరీ కేసులు పెరగటం మంచి పరిణామం. అలా 1,51,367 లక్షల మంది ఒక్కరోజులోనే కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా రికవరీ రేటు 94.55 శాతానికి పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.