‘నేను చనిపోయిన ఫర్వాలేదు..యువ‌కుల్ని బతికించండీ..85ఏళ్ల కరోనా బాధితుడి ఔదార్యం..

‘నేను చనిపోయిన ఫర్వాలేదు..యువ‌కుల్ని బతికించండీ..85ఏళ్ల కరోనా బాధితుడి ఔదార్యం..

85 Years Corona Affected Man bed Sacrifice (1)

85 years Corona Affected man bed sacrifice : కరోనా కల్లోలంలో హాస్పిటల్ లో బెడ్ దొరకటమే గగనంగా మారిని ప్రస్తుత పరిస్థితుల్లో ఓ పెద్దాయన పెద్ద మనస్సు చాటుకున్నాడు. ‘‘బ్రతకాల్సింది నేను కాదు.. యువత బ్రతకాలి..ఆస్పత్రిలో ఇప్పటి వరకూ నేను చికిత్స పొందిన బెడ్ కరోనాతో బాధపడే ఏ యువకులకైనా ఇవ్వండీ..నేను ఇంటికెళ్లిపోతా..నేను చనిపోయినా ఫరవాలేదు..నా బెడ్ ఓ యువ‌కుడి ప్రాణం కాపాడ‌గ‌ల‌దు అంటూ ఇంటికెళ్లిపోయాడు 85ఏళ్ల నారాయ‌ణ ధ‌బేల్క‌ర్ అనే పెద్దాయ‌న..పెద్ద వయస్సులో ఉండి కూడా అంతటి పెద్ద మనస్సు చాటుకున్న ఆ పెద్ద మనస్సుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారంతా..

మ‌హారాష్ట్రలో క‌రోనా ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆస్పత్రి బెడ్ దొరికితే… కరోనాను జ‌యించినంత సంతోషప‌డిపోతున్న ప‌రిస్థితి. కరోనా సోకి ఆస్పత్రిలో జాయిన్ అయిన చికిత్స పొందుతున్న 85ఏళ్ల నారాయ‌ణ ధ‌బేల్క‌ర్ అనే వృద్ధుడు చలించిపోయారు. కరోనాతో తన కళ్లముందే ఎంతోమంది చనిపోవటాన్ని చూసి కదిలిపోయారు. కరోనా సోకి వచ్చేవారికి బెడ్లు లేవని పంపించేయటాన్ని చూసి ఆయన మనస్సు ద్రవించిపోయింది. అంతే ఆయనో నిర్ణయం తీసుకన్నాడు. ‘‘నా వయస్సు 85 ఏళ్లు నేను జీవితం మొత్తం చూశా. ఎన్నో ఎత్తుపల్లాలు చూసా..సంతోషాలు చూసా..ఇక నేను బ్రతికినా, చనిపోయినా ఫరవాలేదు. కానీ యువత బతకాలి..నాకు బెడ్ వ‌ద్దు… ఇంటికెళ్లిపోతా..నా బెడ్ ఓ యువ‌కుడి ప్రాణం అయినా..కాపాడగ‌ల‌దు అంటూ ఇంటికెళ్లిపోయాడాయన.

నేను కూడా చాలామందిలాగా కరోనా కోరల్లో చిక్కుకున్నాను. కానీ బ్ర‌త‌కాల్సింది నేను కాదు యువ‌త అంటూ ధైర్యంగా నాగ‌పూర్ ఆసుప‌త్రి నుండి ఇంటికెళ్లిపోయారు నారాయణ ధబేల్కర్. నిజంగానే ఆయన అలా ఆస్పత్రినుంచి ఇంటికెళ్లిన మూడు రోజుల‌కే నారాయణ ధబేల్కర్ కరోనాకు బలపోయారు. మ‌ర‌ణించారు.

తండ్రి మరణంతో కదిలిపోయిన నారాయణ దభేల్కర్ కుమార్తె మాట్లాడుతూ..ఏప్రిల్ 22న మా నాన్న శ్వాస ఆడని స‌మ‌స్య‌తో ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా..ఆయనకు అత్యంత కష్టంమీద ఓ బెడ్ దొరికింది. కానీ ఆసుప‌త్రిలో బెడ్స్ ప‌రిస్థితి చూసి మా నాన్న ఓ యువ‌కుడికి జీవితం ఇవ్వాల‌న్న ఉద్దేశంతో ఇంటికొచ్చేయాలనుకున్నారు. అలా ఇంటికొచ్చిన ఆయన చాలా సంతోషపడ్డారు ఏమాత్రం బాధపడలేదు. మీ పరిస్థితి బాగాలేదు..ఇక్కడే ఉండి ట్రీట్ మెంట్ తీసుకోండని డాక్టర్లు చెప్పినా వినలేదు.

మాతో కలిసి చివ‌రి రోజులు గ‌డ‌పాల‌ని ఉంది అంటూ చెప్పి ఇంటికొచ్చారు అని తెలిపింది. మానాన్నది చాలా గొప్ప మనస్సు..ఈరోజుల్లో తమ స్వార్థం తప్ప పక్కవారి పరిస్థితి పట్టించుకోని ఈరోజుల్లో మానాన్న తీసుకున్న నిర్ణయం చాలా చాలా గ్రేట్..కానీ మానాన్నను మేం కోల్పోయాం..అని కన్నీటితో తెలిపింది. కానీ..ఆ 85 ఏళ్ల పెద్దాయన ఏ ఉద్ధేశ్యంతో యువకులకు బెడ్ ఇవ్వాలని ఇంటికెళ్లిపోయారో ఆస్పత్రి మాత్రం అలా చేయలేదనీ..ఆయ‌న సూచించిన యువకుడికి ఆ బెడ్ మాత్రం ఇవ్వ‌కుండా…వేరే వారికి కేటాయించారని నేషనల్ మీడియో తెలిపింది.