#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్లలో మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారో తెలుసా? ఆ ఏడాది మాత్రం ఒక్క విదేశీ పర్యటనకూ వెళ్లలేదు..

మోదీ అత్యధికంగా అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించారు. ఆ రెండు దేశాలకు ఏడు సార్ల చొప్పున వెళ్లారు. అనంతరం...

#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్లలో మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారో తెలుసా? ఆ ఏడాది మాత్రం ఒక్క విదేశీ పర్యటనకూ వెళ్లలేదు..

Narendra Modi

Narendra Modi: “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారు.. అప్పుడప్పుడు భారత్ లో పర్యటిస్తుంటారు” అప్పట్లో ప్రతిపక్షాలు చేసిన విమర్శ ఇది. ప్రపంచంలో భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టడానికి, పెట్టుబడులు తీసుకురావడానికే మోదీ విదేశాల్లో పర్యటిస్తూ కష్టపడుతున్నారని బీజేపీ నేతలు అంటుంటారు.

మోదీ 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని విదేశీ పర్యటనలు చేశారో తెలుసా? భారత్ నుంచి విదేశాలకు మోదీ 68 సార్లు వెళ్లారు. తొమ్మిదేళ్లలో మొత్తం 64 దేశాలు పర్యటించినట్లు తెలుస్తోంది.

తాజాగా, తన 68వ విదేశీ పర్యటనలో మోదీ… జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలో ఆయా దేశాల అధినేతలను కలిశారు. పలు దేశాల్లో పర్యటనలు ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేస్తే, మరికొన్ని పర్యటనలు జీ 7, జీ 20, క్వాడ్ వంటి కూటముల సదస్సుల కోసం చేస్తున్నారు.

2020లో ఒక్క విదేశీ పర్యటనా చేయలేదు..

మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారి భూటాన్ లో పర్యటించారు. ఆ తర్వాత బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లారు. మోదీ అత్యధికంగా అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించారు. ఆ రెండు దేశాలకు ఏడు సార్ల చొప్పున వెళ్లారు. అనంతరం ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఆరేసి సార్ల చొప్పున పర్యటించారు.

చైనా, నేపాల్, రష్యాల్లో అయిదేసి సార్ల చొప్పున పర్యటించారు మోదీ. 2020 ఏడాది కరోనా విజృంభణ సమయంలో మాత్రం విదేశీ పర్యటన ఒక్కటీ చేయలేదు. కరోనా ప్రభావం తగ్గాక తదుపరి ఏడాది నుంచి మళ్లీ విదేశీ పర్యటనలు కొనసాగిస్తున్నారు.

#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్ల పాలనలో మోదీకి ఎదురైన 5 అతిపెద్ద సవాళ్లు, తీవ్ర విమర్శలు..