Mumbai Hotel Bomb Threat Call : ముంబై ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్..రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్

ముంబైకి ఉగ్రవాదుల బెదిరింపులు పెరిగిపోతున్నాయి. గతంలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్ లో నాలుగు చోట్ల బాంబులు అమర్చామని సోమవారం బెదిరింపు కాల్ చేశారు.

Mumbai Hotel Bomb Threat Call : ముంబై ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్..రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్

Mumbai Hotel Bomb Threat Call : ముంబైకి ఉగ్రవాదుల బెదిరింపులు పెరిగిపోతున్నాయి. గతంలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్ లో నాలుగు చోట్ల బాంబులు అమర్చామని సోమవారం బెదిరింపు కాల్ చేశారు.

Bomb threat to Yogi: సీఎం యోగికి బాంబు బెదిరింపు

బాంబులను నిర్వీర్యం చేసేందుకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే బాంబులు పేల్చేస్తామని బెదిరించారు. అయితే సెక్యూరిటీ చెకింగ్ జరిగిన తర్వాత ఆ బెదిరింపు కాల్ ఉత్తదేనని పోలీసులు స్పష్టం చేశారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.