Vaccinated Bharath : మా లక్ష్యం వ్యాక్సినేటెడ్ భారత్.. దానికోసం ఎంత ఎత్తుకైనా వెళ్తాం

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా మరికొన్ని రాష్ట్రాలు 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశాయి.

Vaccinated Bharath : మా లక్ష్యం వ్యాక్సినేటెడ్ భారత్.. దానికోసం ఎంత ఎత్తుకైనా వెళ్తాం

Vaccinated Bharat

Vaccinated Bharath : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి చేశాయి. కొన్ని రాష్ట్రాలు 80 శాతం రెండో డోసు కూడా పూర్తి చేశాయి. తెలంగాణలో 70 శాతం మంది రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం 15 నుంచి 18 ఏళ్ల మధ్య టీనేజర్లకు వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించింది. జనవరి రెండున ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్.. జనవరి 5తేదికి 15-18 ఏళ్ల వయసు కలిగిన కోటిమందికి పైగా టీనేజర్లకు మొదటి డోసు అందించింది.

చదవండి : Covid Vaccine: పన్నెండోసారి కోవిడ్ వ్యాక్సిన్ డోస్ తీసుకుంటూ దొరికిపోయిన ప్ర’వృ’ద్ధుడు

వైద్య సిబ్బంది చొరవతో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. సముద్రమట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని హౌల్-స్పితి జిల్లా, హిక్కిం గ్రామంలో వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో, మంచుతో కప్పబడి ఉన్న ఈ ప్రదేశానికి గురువారం ఉదయం చేరుకున్న వైద్య సిబ్బంది.. మధ్యాహ్నం వరకు గ్రామంలోని 15 -18 మధ్య వయసు వారికి వ్యాక్సిన్ అందించారు.

చదవండి : Corona Vaccine:కరోనా వ్యాక్సిన్…9 కోట్ల డోసుల కోసం డీల్స్ కుదుర్చుకున్న బ్రిటన్

అనంతరం వైద్య సిబ్బందిలోని ఓ మహిళ మాట్లాడుతూ.. మొత్తం 90 మంది టీనేజర్లకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. తమ లక్ష్యం వ్యాక్సీనేటెడ్ ఇండియా అని.. దానికోసం ఎంత ఎత్తుకైనా ఎక్కుతాం.. ఎన్ని నదులైన దాటుతామని తెలిపారు. కొందరు వ్యాక్సిన్ తీసుకోడానికి ముందుకు రావడం లేదని.. కానీ వారికి వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు తొలగించి వ్యాక్సిన్ ఇస్తున్నామని తెలిపారు. మంచు దుప్పటి కప్పేసిన గ్రామాల్లోకి కూడా వచ్చి వ్యాక్సిన్ అందిస్తున్నామని.. అది తమ కర్తవ్యమని ఎంతో ఉత్సాహంగా తెలిపారు.

చదవండి : Covovax Vaccine: ఆ మూడు దేశాలకు 7కోట్ల వ్యాక్సిన్ల ఎగుమతి